సీఐఎస్ఎఫ్ ఎస్సై ఆత్మహత్య
తిరుపతి ముచ్చట్లు:
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ కేంద్రంలో 24 గంటల్లో మరొక దారుణం జరిగింది. 4 గంటల వ్యవధిలో ఇద్దరు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల సిబ్బంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వికాస్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి. అయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేవలం మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్సైగా చేరాడు. తోటి సిబ్బంది, ఎస్సై వికాస్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.ఆదివారం రాత్రి ఓ జవాను చింతామణి పీసీఎంసీ రాడార్-1 ప్రాంతంలోచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Tags; CISF SSI commits suicide

