రెంటికీ చెడ్డ రేవడిలా నగరాలు, పట్టణాలు

Date:20/11/2019

రాజమహేంద్రవరం ముచ్చట్లు:

చెత్త నిర్వహణ విషయంలో జిల్లాలోని నగరాలు, పట్టణాలు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తలపెట్టిన తడి, పొడి చెత్త సేకరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని చెత్త రహిత నగరాలుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ను ప్రకటించింది. అందులో భాగంగా ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని నిర్దేశించారు. తడిగా ఉండే దాంతో సేంద్రియ ఎరువు తయారీ, పొడిగా ఉండేదానిలో ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను రీ-సైక్లింగ్‌ చేయడం మరో ప్రక్రియ. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక నిధులను కేటాయించింది. 14వ ఆర్థిక సంఘం నిధులను కూడా కొంత కేటాయించారు. అప్పట్లో సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఎనిమిది చోట్ల వీటిని ఏర్పాటు చేయగా, కేవలం రెండుచోట్ల అంతంతమాత్రంగా ప్రక్రియ చేపడుతున్నారు. కాకినాడలో ఒకటి మాత్రమే ఉండగా, దాని నిర్వహణ అరకొరగానే ఉంది. మిగిలిన ఏడు మున్సిపాల్టీల్లోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాలను మొక్కుబడిగా పెట్టి వదిలేశారు. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణను సక్రమంగా నిర్వహించకపోవడమే అవి పనిచేయక పోవడానికి ప్రధాన కారణం. మరోవైపు చెత్త ..మిగతా 2లోనిర్వహణ, సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాల పేరుతో డంపింగ్‌ యార్డులకు స్వస్తి పలికారు.

 

 

 

 

 

 

 

దీంతో ఆయా పురపాలిక సంఘాల్లో చెత్తను నిల్వ చేసేందుకు డంపింగ్‌ యార్డులు లేకపోవడంతో ఖాళీగా ఉన్న స్థలాల్లో పారబోస్తున్నారు. అటు చెత్త నిర్వహణ లేక, ఇటు డంపింగ్‌ యార్డులు లేక రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైంది. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన రియల్‌ టైం మోనటరింగ్‌ సిస్టమ్‌( ఆర్టీఎంఎస్‌) విధానం పురపాలక సంఘాల్లో పూర్తిగా విఫలమైంది. వాస్తవానికి చెత్త సేకరణలో పూర్తి జవాబుదారీతనంగా ఉండే విధంగా ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రక్రియలో ప్రతి ఇంటికీ బార్‌ కోడ్‌ ఉన్న చిప్‌లను అమర్చారు. చెత్త సేకరించే రిక్షా కార్మికుడు ఉదయాన్నే ఇంటింటికీ వచ్చి చెత్త సేకరణ చేసిన తరువాత తన దగ్గర ఉండే స్కేన్‌ మిషన్‌తో ఇంటి గోడపై ఉంచి బార్‌ కోడ్‌కు స్కాన్‌ చేస్తారు. తద్వారా ఆ ఇంటి నుంచి చెత్త సేకరణ జరిగినట్లు నిర్ధారణ అవుతుంది. ఈ విధానం పక్కాగా అమలు కావాలనే ఉద్దేశంతో ప్రతి 250 ఇళ్లకు ఒక రిక్సా కార్మికుడిని కేటాయించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ సైతం నామమాత్రంగా అమలు చేస్తున్నారు.

 

కళాకారులకు టీటీడీ సత్రాలు ఇవ్వాలి

 

Tags:Cities and towns are bad for both

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *