పౌరులు చట్టాలకు విధేయులుగా ఉండాలి

Citizens must obey the laws

Citizens must obey the laws

– సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌

Date:09/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పౌరులందరు చట్టాలకు విధేయులుగా ఉంటు సమాజంలో జీవించాలని పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ తెలిపారు. శనివారం మున్సిపాలిటిలో న్యాయవిజ్ఞాన సదస్సును న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌, అడిషినల్‌ జూనియర్‌ జడ్జి రమణారెడ్డి హాజరైయ్యారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబునాయక్‌ మాట్లాడుతూ ప్రజలు చట్టాలను, న్యాయాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరు తమ అవసరాల కోసం డబ్బులు తీసుకునే సమయంలో ఖాళీ బాండ్లు, ఖాళీ చెక్కులు ఇవ్వడం చేస్తున్నారన్నారు. అలాగే అప్పు తీర్చిన తరువాత చెక్కులు, బాండ్లు వాపస్సు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఖాళీ బాండ్లు, చెక్కుల్లో సంతకాలు చేసి ఇవ్వడంతో వాటిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న అప్పులు, గడువులు ఖచ్చితంగా అందులో నమోదు చేసి ఇవ్వాలన్నారు. ఇలాంటి సమయంలో అవకతవకలు జరగకుండ నివారించేందుకు వీలుందన్నారు. అడిషినల్‌ జూనియర్‌ జడ్జి రమణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు తీవ్రమౌతున్నందున ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహిళలను వేదించిన, మహిళలను ఎలాంటి లైంగిక వేదింపులకు గురి చేసిన ఫోక్సో చట్టం క్రింద శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మైనర్‌ బాలికల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైన తక్షణమే సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తులతో ఫోన్‌లలో మాట్లాడటం, మెసెజ్‌లు పెట్టడం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. వీటి పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్రీరాములురెడ్డి, ఏజిపి ప్రభాకర్‌నాయుడు, న్యాయవాదుల సంఘ కార్యదర్శి కెవి.ఆనంద్‌కుమార్‌, న్యాయవాదులు షమివుల్లా, జహిర్‌, లోక్‌ అదాలత్‌ మెంబర్లు ప్రశాంతి, సుబ్రమణ్యం, మున్సిపల్‌ మేనేజర్‌ రసూల్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

కొర్ర గడ్డి వాము దగ్ధం

Tags: Citizens must obey the laws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *