లోకసభలో పౌరసత్వ బిల్లు

Citizenship Bill in the Lok Sabha

Citizenship Bill in the Lok Sabha

Date: 09/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు 2019పై దేశవ్యాప్తంగా ఆసక్తిర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ముందుకు బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. లోక్‌సభలో ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బిల్లుపై సభ్యులు లేవనెత్తుతున్న అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని అన్నారు.ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధరి మాట్లాడుతూ.. మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ఈ బిల్లుని తీసుకువచ్చారని ఆరోపించారు. ఆర్టికల్ 5, 15లకు ఈ బిల్లు వ్యతిరేకమని, సమానత్వ హక్కుకు భంగం కలిగించేదిగా ఉందన్నారు. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు రాజ్యాంగం కల్పించిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై షా స్పందిస్తూ.. మైనారిటీలకు ఈ బిల్లు ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బిల్లుపై చర్చలో పాల్గొనాలని.. సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్‌ చేయోద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మతప్రాతిపదికన విడగొడుతోందని, ఈ బిల్లు అవసరాన్ని గుర్తించడం లేదని షా విమర్శించారు. ఓటింగ్ నిర్వహించిన తర్వాత బిల్లును లోక్‌సభలో షా ప్రవేశపెట్టారు.

 

 

 

 

 

 

 

ఈ బిల్లుకు 293 మంది అనుకూలంగా, 83 మంది వ్యతిరేకంగా ఓటేశారు.పొరుగు దేశాలైన అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందూ, సిక్కు, జైన్‌, బౌద్ధ, పార్శీ, క్రైస్తవులు వివిధ కారణాల వల్ల దేశంలోకి వస్తే అలాంటి వారికి భారతీయ పౌరసత్వం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరసత్వ చట్టం-1955లో నిబంధనలను సవరిస్తూ బిల్లును ప్రతిపాదించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశంలోకి వచ్చినవారిని చట్టవ్యతిరేక కాందిశీకులుగా ముద్రవేస్తారు. ఎలాంటి పత్రాలు లేకుండా భారత్‌కు వచ్చి గడువుకు మించి ఇక్కడే ఉంటే వారందర్నీ అక్రమ వలసదార్లుగా గుర్తిస్తారు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వల్ల అలాంటి వారందరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.ఇదిలా ఉండగా దేశ పౌరులను మతప్రాతిపదికన వేరు చేయకూడదని రాజ్యాంగం చెబుతుంటే, కేవలం కొన్ని మతాలవారికి మాత్రమే పౌరసత్వం కల్పించి, మిగతా వారిని విస్మరించడం చెల్లుబాటవుతుందా? అని విపక్షాలు నిలదీస్తున్నాయి. పౌరసత్వం నిర్ధరణకు మతం ప్రాతిపదిక కాదని రాజ్యాంగ నిర్మాతలే చెప్పినందున ఈ సవరణ రాజ్యాంగబద్ధమవుతుందా? అని కాంగ్రెస్‌ సహ విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

 

మహిళలపై అత్యాచారాలు చేస్తే..మూడు వారాల్లో శిక్ష

 

Tags:Citizenship Bill in the Lok Sabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *