Citizenship law is unconstitutional

పౌరసత్వ చట్టం రాజ్యాంగ విరుద్ధం

– ఒంటి కాలిపై నిలబడి ముస్లిం నిరసన

Date:17/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో తీసుకొచ్చిన పౌరసత్వచట్టం రాజ్యాంగ విరుద్ధమని, దానిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ ముస్లింలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఇందిరా సర్కిల్‌లో ముస్లింలు ఏడవ రోజు నిరాహారదీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయిషామసీదు ముతవల్లి ఖాదర్‌బాషా మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఒక పథకం ప్రకారం ముస్లింలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. హిందూముస్లింలు బాయ్‌బాయ్‌ అనే నినాదంతో భారతదేశంలో ప్రజలు జీవిస్తున్నారని, ఇందుకు విరుద్ధంగా ఇలాంటి చట్టాలు అమలు చేస్తే విబేదాలు తీవ్రమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు ప్లకార్డులు పట్టుకుని పౌరసత్వం వద్దు… ఎన్‌ఆర్‌సి,సీఐఏ, ఎన్‌ఆర్‌పి రద్దుపరచండి…. రాజ్యాంగాన్నికాపాడండి…. దేశాన్నివిభజించ వద్దు అన్న నినాదాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ దీక్షల్లో సీఐటియు కార్యదర్శి వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొని ముస్లింలకు సంఘీబావం తెలిపారు.

జనసేన ఆధ్యాయం ముగిసింది

Tags: Citizenship law is unconstitutional

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *