Natyam ad

సీఐటీయూ 17వ అఖిలభారత మహాసభలు  

కడప  ముచ్చట్లు:


సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు ) 17వ అఖిలభారత మహాసభలు రేపటి నుంచి 22వ తేదీ వరకు బెంగళూరు సిటీ లో ఐదు రోజులపాటు జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే శ్రీనివాస్ రెడ్డి బి మనోహర్, జిల్లా ట్రెజరర్ బి లక్ష్మీదేవి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఈ మహాసభలకు ప్రత్యేకత ప్రాధాన్యత ఉన్నది అని తెలిపారు కేంద్రంలో ఉన్న బిజెపి కార్మిక  చట్టాలను కాలరాశి ప్రభుత్వ సంస్థలను అమ్మేయడమే పనిగా ఉన్నాయని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, చేయలేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను  కాలరాస్తున్నాయన్నారు. ఈ విధానాలపైమహాసభలో చర్చించబోతున్నారని తెలిపారు .

 

 

ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు చెప్పేదొకటి చేసేదొకటేని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఈ మహాసభలు జరగడం విశేషమని కొనియాడారు. అలాగే గత మూడు సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలను సమీక్షించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి ఈ మహాసభ బెంగళూరు వేదికైందని తెలిపారు. అలాగే 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు బెంగళూరు నేషనల్ గ్రౌండ్ నందు జరగబోయే , ర్యాలీ,బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

 

Post Midle

Tags; CITU 17th All India Congress

Post Midle