Natyam ad

నెహ్రు మునిసిపల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

మునిసిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ తో నిర్మిస్తున్న నెహ్రు మునిసిపల్ స్కూల్ గ్రౌండ్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .నగరాభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రన, విశాలమైన రోడ్లు, ప్రజల జీవనప్రమాణాల మెరుగుపడే చర్యల్లో భాగంగా అలిపిరి రోడ్డు మునిసిపల్ హై స్కూల్ గ్రౌండ్ నుండి సింగాలగుంట, గిరిపురం, చెన్నారెడ్డి కాలనీ, ఓల్డ్ మెటర్నటీ హాస్పిటల్ రోడ్డు ను కలుపుతూ నిర్మిస్తున్న కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనులను డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారు పరిశీలించి, నిర్మాణ పనులను నాణ్యతగా చేయాలనీ, త్వరగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.ఇందులో ఎం ఈ వెంకటరమణ రెడ్డి , మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇమ్రాన్ బాషా , కార్పొరేటర్ పొన్నాల చంద్ర , బస్వా బాలసుబ్రమణ్యం  తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: City Deputy Mayor Bhumana Abhinay Reddy inspected the construction works of Nehru Municipal School

 

 

Post Midle