Natyam ad

ఛత్తీస్ ఘడ్ పర్యటనకు నగర మేయర్

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య శుక్రవారం ఛత్తీస్ ఘఢ్ రాష్ట్ర పర్యటనకు వెళ్ళనున్నారు.చత్తీస్ ఘడ్ లోని రాయ్పూర్ నగరంలో జరగనున్న ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ వారి 51వ వార్షిక సాధారణ సమావేశంంలో ఆయన పాల్గొనున్నారు.శుక్రవారం హైదరాబాద్ నుంచి విమానంలో రాయ్పూర్ వెళ్ళి, శని, ఆది వారాల్లో ఏ.ఐ.సి‌.ఎం. సమావేశాల్లో పాల్గొని తిరిగి సోమవారం కర్నూలు నగరానికి రానున్నారు.

కాగ ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విధివిధానాల్లో చేయాల్సిన మార్పులు, గతంలో అమలు చేసిన పథకాలను మళ్ళీ అమలు, నూతన పథకాలు, మున్సిపల్ కార్పొరేషన్ హక్కులు, చెత్త రీసైక్లింగ్, త్రాగునీటి, క్లీన్ సిటీ, ప్లాస్టిక్ బిన్ సిటి వాటిలకు ప్రత్యేక నిధులు వంటి అంశాలను ప్రస్తావించడానికి మేయర్ ఇప్పటికే సమగ్ర నివేదికలను నగర పాలక సంస్థ అధికారులతో తెప్పించుకున్నారు.

 

Post Midle

Tags: City Mayor to visit Chhattisgarh

Post Midle

Leave A Reply

Your email address will not be published.