పుంగనూరులో పౌరసేవల పరుగులు

– నానబాలవీధి సచివాలయంలో 10659 సేవలు
– మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖా ఫస్ట్

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రికగా ఏర్పాటైన సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో గత మూడేళ్ల క్రితం ప్రారంభమైంది. పౌరసేవలు అందిస్తూ , ప్రజల ముంగిటకు పరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పుంగనూరులోని 16 సచివాలయాలు పారదర్శకంగా పనిచేస్తూ పౌరసేవలు 97.57 శాతం అందించి జిల్లాలో పరుగులు తీస్తోంది. రాష్ట్ర అటవీ, ఇంధనశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరు మున్సిపాలిటి కమిషనర్‌ నరసింహప్రసాద్‌ , మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో సేవలు అందించడంలో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే సచివాలయాలకు పారిశుద్ధ్య కార్యక్రమాలను అప్పగించి, నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కాగా గత రెండు సంవత్సరాలుగా పుంగనూరు మున్సిపాలిటి అగ్ర స్థానంలో నిలవడంతో మున్సిపాలిటి సేవలను ప్రజలు ప్రశంసిస్తున్నారు.


సచివాలయాల సేవలు, ర్యాంకులు …

జిల్లాలో చిత్తూరు కార్పోరేషన్‌, మున్సిపాలిటిలు పుంగనూరు, కుప్పం, పలమనేరు, నగరి, ఉన్నాయి. వీటిలో 96 సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి, ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రజలకు అవసరమైన ఇండ్ల పట్టాలు, పెన్షన్లు, రేషన్‌కార్డులు, ధృవపత్రాలు , రెవెన్యూ రికార్డులతో పాటు 523 సేవలను సచివాలయాల ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు జిల్లాలోని సచివాలయాల్లో ఇప్పటి వరకు వెహోత్తం 8,23,141 మంది ప్రజలకు సేవలు అందించారు. ఇందులో 5 మున్సిపాలిటిల్లో 1,11,979 మందికి సేవలు అందించారు. వీటిలో పుంగనూరులో 24,441 మందికి సేవలు అందించగా అందులో నానబాలవీధి సచివాలయంలో 10,659 మంది ప్రజలకు సేవలు అందించి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే పలమనేరు నియోజకవర్గంలోని గంటాఊరు , ఎద్దులసంత సచివాలయాలు 2, 3 స్థానాల్లో నిలిచాయి. 4, 5 స్థానంలో నగరి మున్సిపాలిటి ట్రగండ్రిగా, సత్రవాడ సచివాలయాలు, 6వ స్థానంలో చిత్తూరు హౌసింగ్‌కాలనీ సచివాలయం నిలిచింది.


సేవలు ఇలా….

మున్సిపాలిటి పరిధిలోని 16 సచివాలయాలలో నానబాలవీధి సచివాలయ కార్యదర్శి నోముకుమార్‌ , వార్డుఎడ్యూకేషన్‌, డేటాప్రాసెసింగ్‌ సెక్రటరీ మనోహర్‌ లు సేవలు అందించడంలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ సచివాలయంలో రెవెన్యూకు సంబంధించి 9,213 మందికి సేవలు అందించారు. అలాగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి 422 , స్కీల్‌డెవలెప్‌మెంట్‌కు సంబంధించి 408 , మున్సిపాలిటికి సంబంధించి 221 , సివిల్‌ సఫ్లెయ్స్కు చెందిన 216, పంచాయతీరాజ్‌కు సంబంధించి 74 , తదితర సేవలను 10659 మందికి అందించి అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాది కూడ నానబాలవీధి సచివాలయం సేవలు అందించి ప్రశంసలు పొందారు.

ఆదర్శంగా ఉండాలి….

సచివాలయాలలో విస్తృత సేవలు అందించి రాష్ట్రంలో ఆదర్శంగా, పారదర్శక పాలన అందించాలని అధికారులకు , పాలక మండలికి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నా. నిర్లక్ష్యానికి, అక్రమాలకు తావులేకుండ ఉద్యోగులు చేస్తున్న సేవలు ప్రశంసనీయం. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రిక సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఎంతో సంతృప్తి లభిస్తోంది. దీనిని పటిష్టపరచడమే లక్ష్యం.

 

ఎప్పటికప్పుడు …

మున్సిపాలిటిలోని 16 సచివాలయాల్లోను ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్యలను చిరునవ్వుతో స్వీకరించి, పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. సచివాలయ కార్యదర్శులు, వలంటీర్ల కృషి ఫలితమే అగ్రస్థానం.

 

బాధ్యత ….

ప్రభుత్వం సచివాలయాల్లో ఉద్యోగం కల్పించింది. ప్రభుత్వానికి కృతజ్ఞతగా మా కర్తవ్యాలను బాధ్యతగా గుర్తించి సచివాలయంలో సేవలు అందిస్తున్నాం. గత ఏడాది అగ్రస్థానంలో నిలిచాం. అప్పటి నుంచి వెనుకపడకుండ స్థానాన్ని కాపాడుకుంటు సెలవు రోజుల్లో కూడ విశ్రాంతి లేకుండ సేవలు అందిస్తున్నాం.

– బి.నోముకుమార్‌, సచివాలయ అడ్మీన్‌ కార్యదర్శి, పుంగనూరు.

కంప్యూటరీ కరణతో పారదర్శకం…

ఎంబిఏ చదివి ఎస్‌ఐ, పంచాయతీ సెక్రటరీలు తదితర ఉద్యోగాలకు ఎన్నిసార్లు ధరఖాస్తు చేసిన రాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒకేసారి ఉద్యోగం వచ్చింది. ఆకృతజ్ఞతతో ప్రజలకు సేవలు అందిస్తున్నా. అర్జీలను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరణ చేసి , ఆయా శాఖలకు పంపుతాం. ప్రజల అవసరాన్ని బట్టి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సేవలు అందిస్తున్నాం. ప్రజలకు అందరి సహకారంతో నిరంతరం సేవలు అందిస్తున్నాం.

– ఎం.మనోహర్‌, వార్డుఎడ్యూకేషన్‌, డేటాప్రాసెసింగ్‌ సెక్రటరీ, పుంగనూరు.

 

Tags: Civil services run in Punganur

Leave A Reply

Your email address will not be published.