స్టీల్ ప్లాంట్,దుగ్గరాజ పట్నంపై కేంద్రం క్లారిటీ

Date:20/11/2019

న్యూడిల్లీ ముచ్చట్లు:

కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు సహా విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై లోక్‌సభలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. కేశినేని నాని లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కడప స్టీల్ ప్లాంటు, దుగరాజట్నం రేవు ఏర్పాటు లాభదాయం కాదని  క్లారిటీ ఇచ్చింది. అలాగే, నియోజకవర్గాల పెంపు కూడా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు పూర్తయ్యేవరకూ సాధ్యం కాదని వెల్లడించింది. విభజన చట్టంలోని అంశాల అమలు ఎంతవరకు వచ్చింది? ఇంతవరకూ విడుదల చేసిన నిధులు ఎన్ని? ఎన్ని సంస్థలు ఏర్పాటుచేశారు? మిగతా వాటి పరిస్థితేంటని ఎంపీ కేశినేని నాని లిఖితపూర్వకంగా ప్రశ్నించారు.కేశినేని ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇస్తూ.. విభజన చట్టంలోని నిబంధన ప్రకారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై సెయిల్ అధ్యయనం చేసిందన్నారు. అయితే, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు ఏర్పాటు లాభదాయకం కాదని తేలిందని పేర్కొన్నారు. అలాగే, సమీప రేవుల నుంచి పోటీ ఉన్నందున దుగరాజపట్నం రేవు ఏర్పాటూ లాభదాయకం కాదని వివరించారు.

 

 

 

 

కాబట్టి, రాష్ట్రంలో వేరేచోట రేవు ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలు ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కూడా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలను అనుసరించి ఉంటుందని తెలిపారు. అంత వరకూ రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను సర్దుబాటు చేయడం సాధ్యంకాదని స్పష్టంచేశారు.రెవెన్యూ లోటు కింద 2015-20 మధ్య రాష్ట్రానికి రూ.22,113 కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని, ఇప్పటి వరకు రూ.19,613 కోట్లు ఇచ్చినట్లు తెలియజేశారు. విభజన చట్టంలోని చాలావాటిని ఇప్పటికే అమలుచేశామని, మిగతావి వివిధ స్థాయిల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని, అందుకోసం తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కొన్నింటి ఏర్పాటుకు చట్టంలో పదేళ్ల వరకు సమయం ఉందని మంత్రి గుర్తుచేశారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏపీలోని వివిధ విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.1,638.34 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని వివరించారు.

 

టీపీసీసీ రేసులో శ్రీధర్ బాబు

Tags: Clarity Center on Steel Plant, Duggaraja Patnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *