ఎన్నికల నిర్వహణపై రాని క్లారిటీ

Date:18/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు వేడి రాజుకుంది… రాజకీయ పార్టీలన్ని ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి. అధికార పార్టీ ఓ అడుగు ముందుకేసి 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది. వారంతా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ప్రతిపక్షాలు ఒకేతాటి పైకి వచ్చేందుకు సన్నద్దమౌతున్నాయి.  కాని కేంద్ర ఎన్నికల సంఘం మదిలో ఏముంది… ముందస్తు ముచ్చటకు ఈసీ పచ్చ జెండా ఊపేనా… ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తుందా… లేక అధికార పార్టీ భావిస్తున్నట్టుగా అంతకు ముందే ఎన్నికలుంటాయా… తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి…
ఆనాలుగు రాష్ట్రాలతో పాటేనా… ఇంకా ఆలస్యం కానున్నాయా… ఎక్కడ చూసినా ఇదే చర్చ. కానీ, దీనిపై మరింత స్పష్టత రావడానికి మరి కొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ.. షెడ్యూల్‌ప్రకటనపై భారత ఎన్నికల కమిషన్‌ తీసుకునే ప్రాతిపదికపైనే అసెంబ్లీ ఎన్నికలు ఆధారపడనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబరు 6వతేదిన రద్దు కావడం… అదే రోజున ఈసీకి సమాచారం చేరింది. ఆ వెంటనే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ చర్యలు చేపట్టింది.
ఓటర్ల జాబితా సవరణ కోసం జారీ చేసిన షెడ్యూల్‌ను కుదించడం దగ్గర్నుంచీ రాష్ట్రంలో ఈసీ బృందం పర్యటన దాకా పరిణామాలు చకచకా జరిగిపోయాయి.రాజకీయంగా లాభంచేరూరుతుందని భావించిన ఆపద్దర్మ మఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దుచేసారు. అసెంబ్లీ రద్దు చేయడానికి ముందే కేసీఆర్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపా పలువురు కేంద్రమంత్రులను కలిసారు.
ముందస్తు ఎన్నికలకు సంభందించ అన్ని అంశాలు కేంద్రం నుండి కేసీఆర్ క్లియరెన్స్ తీసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చాడని పలువురు అభి ప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో ఎన్నికలకు సంభందించిన పలు పనులు చకచకసాగినపోతున్నాయి. తెలంగాణలోని 31జిల్లాలకు ఇవీఎంలు కూడా వచ్చేశాయి.  తెలంగాణలో పర్యటించిన ఎన్నికల బృందం తమ నివేదికను  నేడో, రేపో ఎన్నికల కమిషన్‌కు అందించనున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడాఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేశారు.
Tags:Clarity that does not run on election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *