Natyam ad

కొత్తకొండ జాతరలో ఘర్షణ

-చెలరేగిపోయిన అల్లరిమూకలు

హన్మకొండ ముచ్చట్లు:


హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతరలో అల్లరి మూకలు చెలరేగిపోయాయి. ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్న కొత్తకొండ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం పోలీసులు వైఫల్యంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి కొత్తపల్లి నుండి తరలివచ్చిన ఎడ్లబండ్ల గుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో అల్లరి మూకలు జాతరలో అలజడి సృష్టించాయి. జాతర పర్యవేక్షించాల్సిన పోలీసులు ఎక్కడ కనిపించకపోవడంతో అల్లరి మూకలు దాడులు చేసుకొని తీవ్రంగా కొట్టుకున్నారు. గతంలో చూసిన జాతర్లను భక్తులు భయాందోళనకు గురయ్యారు.

 

Post Midle

బ్రహ్మోత్సవాలు మొదటి నుండి కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు తప్ప భక్తులకు భద్రత విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
పోలీసుల వ్యవహారాన్ని మరవకముందే రాత్రి జరిగిన అల్లరి మొక్కల దాడిని కంట్రోల్ చేయలేదని అల్లరి మూకల దాడులు పూర్తయ్యాక పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

 

Tags: Clash at Kotakonda fair

Post Midle