దర్గా లో ఘర్షణ
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని రహమతాబాద్ దర్గాలో అర్ధరాత్రి హైదరాబాద్ కు చెందిన యువకులు కొందరు వీరంగం సృష్టించారు. దర్గా ఆవరణలో మహిళలు ఉన్న చోట కొందరు హైదరాబాదుకు చెందిన యువకులు నిలబడి ఉండగా వారిని పక్కకు వెళ్లాలని దర్గా సిబ్బంది సూచించారు. వారు పక్కకు వెళ్లకుండా దర్గా సిబ్బందిపై వాదనకు దిగారు వివాదం చెలరేగింది. దీంతో అక్కడే ఉన్న దర్గా ఈవో మొహమ్మద్ హుస్సేన్ కలగజేసుకోవడంతో అతనిపైన ఆ యువకులు తిరగబడ్డారు.ఆ గొడవ కాస్త పెద్ద అవడంతో ఏకంగా ఈఓ మహమ్మద్ హుస్సేన్ తో పాటు పలువురి సిబ్బందిపై దాడి చేశారు.ఈఓ ఫిర్యాదుతో యువకులను అదుపులకు తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. యువకుల దాడిలో గాయపడిన వారిలో ముగ్గురు దర్గా సెక్యూరిటీ గార్డులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tags: Clash in Dargah

