బిజేపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ…

-పోలీసులకు గాయాలు
 
నిజామాబాద్ ముచ్చట్లు:
 
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఎంపి ధర్మపురి అర్వింద్ వచ్చారు. అయనను  అడ్డుకునేందుకు టిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపధ్యంలో టిఆర్ఎస్, బిజేపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట ఉద్రిక్తతంగా మారి ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలను నిలువరచాడిని పోలీసులు రంగంలో దిగారు. ఘర్షణలో ధర్పల్లి ఎస్సై వంశీ కృష్ట తలకు  తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. రెండు  వర్గాలు ఒకరికి వ్యతిరేకంగా మరోకరు  నినాదాలు చేస్తు భయానక వాతావరణాన్ని సృష్టించారు. దీంతో పోలీసులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. గాయాల పాలైన బిజేపి, టిఆర్ఎస్ నాయకులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
Tags:Clashes between BJP and TRS activists

Leave A Reply

Your email address will not be published.