విద్యార్థులకు పదోతరగతి పరీక్షలే కీలకం – జెడ్పీటీసీ సులోచన

Classroom examination for students is crucial - JPPTC Sulochana

Classroom examination for students is crucial - JPPTC Sulochana

Date:12/03/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

విద్యార్థులు ఉన్నత విద్యలను అభ్యసించడానికి పదోతరగతి పరీక్షలే కీలకమైనవని జెడ్పీటీసీ సభ్యరాలు సులోచన వెల్లడించారు. మండల పరిధిలోని రాజుపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం గౌరీశంకర్ ఆద్వర్యంలో సోమవారం పదవతరగతి విద్యార్థులకు జరిగిన వీడ్కోలు సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులుకు పరీక్షా సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ పరీక్షలు బాగా రాసి వందశాతం ఉత్తీర్ణత సాదించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు, పాఠాలు నేర్పిన గురువులకు,పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. అలాగే న్యాయవాది మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. అనంతరం జెడ్పీటీసీ సులోచన గత విద్యాసంవత్సరంలో పదోతరగతిలో మొదటి, ద్వితీయ స్థాయిలలో ఉత్తీరణత సాదించిన విద్యార్థులకు రూ. 5000 క్యాష్ బహుమతిగా అందజేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అప్పినపల్లె సర్పంచ్ సురేష్ బాబు, స్థానిక నాయకులు తమ్మిరెడ్డి, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి భానుప్రతాప్ రెడ్డి, నాగిరెడ్డి, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Classroom examination for students is crucial – JPPTC Sulochana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *