Natyam ad

పల్లె జనానికి శుద్దజలం – మంత్రి పెద్దిరెడ్డి కృషి

– 94 ఆర్‌వోఆర్‌ ప్లాంట్ల నిర్మాణం
– రూ.4.70 కోట్లు విడుదల

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు నీటిని శుద్ది చేసి పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ల సొంత నియోజకవర్గమైన పుంగనూరులో ప్రారంభించారు. నియోజకవర్గంలోని 94 గ్రామాల్లో ఆర్‌వోఆర్‌ ప్లాంట్లు ఏర్పాటుకు రూ. 4.70 కోట్లు విడుదల చేశారు. పనులు ఈనెలాఖరుకు పూర్తికానున్నాయి.

ఆర్‌వోఆర్‌ ప్లాంట్ల ఏర్పాటు…

పుంగనూరు మండలంలో 24 ప్లాంట్లను నిర్మాణాలు పూర్తి చేశారు. చౌడేపల్లెలో- 17, సోమలలో-12 , సదుం -17, పులిచెర్ల -16, రొంపిచెర్ల -8 , నియోజకవర్గంలో 94 నిర్మాణాలు చేపట్టారు. ఒకొక్క ప్లాంటును రూ.5 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటిలో చౌడేపల్లె మినహా మిగిలిన ప్లాంట్ల నిర్మాణం పూర్తికాబడింది. ఈ ప్లాంట్లను గత నెలలో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఒకొక్క ప్లాంటులో 1000 లీటర్ల సురక్షిత జలం విడుదల చేయనున్నారు. ప్లాంట్లను గ్రామాల్లోని ఓవర్‌హెడ్‌ ట్యాంకుల సమీపంలో నిర్మించారు. నీటి సమస్య లేకుండ ప్రజలకు రక్షితజలం సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ బాధ్యతను ఆయా పంచాయతీలకు కేటాయించారు.

ట్యాంకుల నిర్మాణం …

మండలంలో 23 పంచాయతీల్లో రెండవ విడతలో 40 ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మిస్తున్నారు. తొలి విడతలో 40 ట్యాంకులు నిర్మించారు. ఒకొక్క ట్యాంకు నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించారు. వెహోత్తం రూ. 12 కోట్లరూపాయలతో ట్యాంకుల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఒకొక్క ట్యాంకులో 20 వేల లీటర్ల నీటిని నిల్వ చేసి , కొళాయిల ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేపట్టారు.

తాగునీరు-సాగునీరు సమస్య రానివ్వం….

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు సాగునీరు- తాగునీరు సమస్య లేకుండ చేస్తాం. రెండు రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. హెచ్‌ఎన్‌ఎస్‌ కాలువను విస్తరిస్తున్నాం. గండికోట రిజర్వాయర్‌ నుంచి పైపులైన్ల ద్వారా నీటిని ఇక్కడికి తీసుకొస్తున్నాం. ప్రజలకు అవసరమైన ప్రాంతాలలో ఆర్‌వోఆర్‌ప్లాంట్లు నిర్మిస్తున్నాం. రాబోవు 30 సంవత్సరాల వరకు కూడ నీటి సమస్య ఉండదు.

– పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు.

మేము ఊహించలేదు…

పల్లెల్లో ఆర్‌వోఆర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి మాకు రక్షిత మంచినీరు సరఫరా అందుతుందని ఊహించలేదు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తీరింది. మంచినీటి కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే పనిలేకుండ చేశారు. శుద్దజలం పంపిణీ చేస్తున్నారు. మాకు మంచి చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే ఓట్లు వేస్తాం.

– ప్రశాంత్‌రెడ్డి, రైతు, పెంచుపల్లి.

Tags; Clean water for rural people – Minister Peddireddy’s effort

Post Midle