Natyam ad

పుంగనూరులో ఇంటింటికి శుద్దజలం – ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిదున్‌రెడ్డి

– రూ.2370 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ పనులు
– నేతిగుట్లపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లతో
-వందేళ్లు నీటి సమస్య ఉండదు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రూ.2370 కోట్లతో చేపట్టనున్న వాటర్‌ గ్రిడ్‌ పనులతో ఇంటింటికి కొళాయిల ద్వారా శుద్దజలం అందిస్తామని లోక్‌సభపక్ష నేత , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి అన్నారు. ఆదివారం పుంగనూరులో పర్యటించిన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గ పరిధిలోని అన్నమయ్య జిల్లాకు చెందిన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటీ, జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గానికి సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వాటర్‌గ్రిడ్‌ మంజూరు చేశారని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరిక మేరకు వైఎస్సార్‌ జిల్లా గండికోట రిజర్వాయర్‌ నుంచి కృష్ణాజలాలు ఇక్కడికి తరలివస్తాయని చెప్పారు. సోమల మండలంలోని ఆవులపల్లె, పుంగనూరు మండలంలో నేతిగుట్లపల్లెలో రిజర్వాయర్ల నిర్మాణం సాగుతున్నాయని చెప్పారు. వాటర్‌గ్రిడ్‌, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి అయితే పుంగనూరు నియోజకవర్గానికి వచ్చే వందెళ్ల వరకు తాగునీటి సమస్య ఉండదని చెప్పారు.

 

 

వచ్చే 30 ఏళ్ల జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రూ.4300 కోట్లతో గాలేరు, నగరి- హంద్రీనీవా ప్రాజెక్టుల అనుసంధాన పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ అనుసంధానంతో అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు 120 రోజుల పాటు కృష్ణా వరద జలాలను తరలిస్తామన్నారు. ఈ జలాల తరలింపుకోసం రూ. 10219 కోట్లతో పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులు జరగనున్నాయని చెప్పారు. కాలువ, ప్రాజెక్టు అనుసంధాన పనులు పూర్తి అయితే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ముదివేడు, పుంగనూరు నియోజకవర్గంలోని ఆవులపల్లె, నెతిగుట్లపల్లె రిజర్వాయర్లకు , ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని చెరువులకు పుష్కలంగా నీటిని అందిస్తామన్నారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వేలకోట్ల నిధులు ఖర్చు చేశారని , ప్రతి గ్రామానికి రోడ్ల నిర్మాణం విషయంలో పుంగనూరు రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని తెలిపారు. సీఎం ఆశీస్సులతోనే అభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు. రిజర్వాయర్‌ పనులు త్వరలోనే పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మదనపల్లె మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింకా వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Clean water to every house in Punganur – MP Peddireddy Venkatamidun Reddy

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.