శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పరిశుభ్రతకు పెద్దపీట : ఆరోగ్యశాఖాధికారిణి డా షర్మిష్ట

Cleaner in Sriwari Brahmotsavalu: Health officer Dr. Sharifati

Cleaner in Sriwari Brahmotsavalu: Health officer Dr. Sharifati

Date:18/09/2018
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2500 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో నిరంతరాయంగా పనిచేసి తిరుమలలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని ఆరోగ్యశాఖాధికారిణి  షర్మిష్ట తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్లో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.
వాహనసేవల సమయంలో మాడవీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు తాగునీరు అందించేందుకు, క్యూలైన్ల వెలుపల, యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులకు సేవలందించేందుకు అదనంగా 800 మంది సిబ్బందిని నియమించామని, శ్రీవారి సేవకులు భక్తి భావంతో సేవలందించినట్లు తెలిపారు. నాలుగుమాడ వీధులలో నూతనంగా నిర్మించిన 41 శాశ్వత మరుగుదొడ్లు భక్తులకు ఉపయోగించుకున్నట్లు తెలిపారు. రాబోవు వైకుంఠ ఏకాదశి నాటికి పూర్తిస్థాయిలో మరిన్ని మరుగుదొడ్లు భక్తులకు అందుబాటులోనికి ఉంచనున్నట్లు వివరించారు.
గరుడసేవనాడు దాదాపు 6 లక్షల తాగునీరు ప్యాకెట్లు భక్తులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా తిరుమలలోని హోటళ్లు, మఠాలు, ఇతర భోజనశాలల్లో నాణ్యమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, తాగునీటి నాణ్యతను ముందుగా సీనియర్ అనలిస్టు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పరిశీలించిన తర్వాత అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు చెత్త సేకరించి డంపింగ్యార్డులకు తరలిస్తున్నామన్నారు.
అదే విధంగా బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజూ తిరుమలలో 90 టన్నుల మానవ విసర్జాలను శుభ్రం చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా కామన్ కమాండింగ్ సెంటర్లో ఆర్యోగ్యశాఖకు చెందిన అధికారులకు తెలియపరచినచో తక్షణం చర్యలు తీసుకుంటారు. ఈ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు. అంటు వ్యాధులు ప్రభలకుండా భక్తులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాలు, తిరుమలలోని మరుగుదొడ్ల వద్ద పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
Tags:Cleaner in Sriwari Brahmotsavalu: Health officer Dr. Sharifati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *