అస్సాం రాష్ట్రంలోని జిల్లాల మధ్యపరిశుభ్రతపై స్వచ్ఛతాపోటీలు
విజేతగా నిలిచిన జిల్లాకు వంద కోట్ల రూపాయల నగదు
డిస్‌పూర్ ముచ్చట్లు:
అస్సాంముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మసంచలన ప్రకటన చేశారు. అస్సాం రాష్ట్రంలోని జిల్లాల మధ్యపరిశుభ్రతపై స్వచ్ఛతాపోటీలు పెట్టనున్నారు. కాంపిటీషన్‌లో విజేతగా నిలిచిన జిల్లాకు వంద కోట్ల రూపాయల నగదు బహుమతి ప్రకటించనున్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఆ నిధులు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాదు ఖుమ్‌తాయ్నియోజకవర్గంలోని జడ్‌పీసీ ప్రాంతంలోని గ్రామాల మధ్య, టీ గార్డెన్‌ల మధ్య కూడా స్వచ్ఛతకు సంబంధించిన పోటీ ప్రకటించారు. ఈ పోటీల ద్వారా అస్సాం దేశంలోనే అత్యంత పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వచ్ఛతా పోటీలపై బ్లూ ప్రింట్ కూడా విడుదల చేయనున్నారు. స్వచ్ఛతా పోటీల ద్వారా పర్యాటకంగా కూడా తమ రాష్ట్రానికి మేలు చేకూరుతుందని శర్మ చెబుతున్నారు.2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీస్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే రాష్ట్రాల మధ్య, నగరాల పోటీ పెట్టి పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నారు. స్వచ్ఛభారత్ ఉద్యమంపై అన్ని రాష్ట్రాల్లోనూ అవగాహన పెరిగింది.

Tags;Cleanliness contests on cleanliness between districts of Assam state
