Natyam ad

కాల్వల పరిశుభ్రతే లక్షం  వెంకట దాస్. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్

నంద్యాల ముచ్చట్లు:

 

పట్టణంలో కాలువలను,  శుభ్రం చేయడంతోపాటు, నీటికాలుష్యాన్ని నివారించేందుకు పట్టణ వాసులు భాగస్వాములు కావాలని అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ పిలుపునిచ్చారు. పరి శుభ్రత లో  భాగంగా  పట్టణంలోని పలు వార్డుల్లో , సిబ్బందితో కలిసి అవగాహన  నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి కాలువల వెంట పేరుకుపోయిన చెత్త చెదారం, ఇతర వ్యర్థాలను ఏరి శుభ్రం చేయాలని తగు సూచనలు చేశారు .  అనంతరం అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ .మాట్లాడుతూ కాలువల్లో వ్యర్థాలు పౌరులు, వ్యాపారులకు తగిన అవగాహన  కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నట్లు వెల్లడించారు. కాలువల్లో వ్యర్థాలు ఇష్టానుసా రంగా వేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కాలుష్యకారక ప్రాంతాలపై ఇప్పటికే అవగాహన కల్పించామని తెలిపారు.  హోటల్ యజమానులు, ప్రజలు పాల్గొని జలకా లుష్యాన్ని నివారించేందుకు సహకరించాలని కోరారు. కాలువలపై ఉన్న వంతెనల వద్ద ప్ర త్యేకంగా కంచె అమర్చాలని హెచ్చరిక బోర్డు లను ఏర్పాటు చేయాలని సిబ్బంది కి సూచించారు.

 

Tags: Cleanliness of canals is the aim of Venkata Das. Municipal Assistant Commissioner

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.