ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Date:14/05/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో తుదివిడుత పరిషత్ ఎన్నికలు మంగళవారం ముగిసింది. 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు కట్టుదిట్టుమైన భద్రతాచర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు పోలింగ్ జరిగింది. తీవ్రవాద ప్రాబల్యం ఉన్న 205 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగించారు. తుది విడుతలో 27 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికలు మొదటి విడుతలో, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాల పోలింగ్ రెండోవిడుతలో పూర్తయింది. తొలి విడుతలో 76.80 శాతం, రెండో విడుతలో 77.63 శాతం పోలింగ్ నమోదైంది.
161 జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది, 1,738 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్‌లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకునే విధంగా 144 సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాల్లో ఫొటోలు తీసేవారిపై చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈనెల 27న పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో నిలిచారు. .
Tags: Clear polling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *