రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం…
ఇప్పటివరకు 47 పనిదినాల్లో 96 లక్షల 7 వేల 764 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు….
15 లక్షల 65 వేల మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ..

ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమని గుర్తించిన వారి సంఖ్య 11.68లక్షలు….
కంటి సమస్యలు లేని వారు 68,73,020…
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 96 లక్షల 7 వేల 764 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమములో మొత్తం నేటి వరకు 15 లక్షల 65వేల మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నది. గత జనవరి 18న, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల కంటి సమస్యలను దూరం చేస్తున్నది. 47 పనిదినాల్లో ఇప్పటి వరకు 96 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తి కాగా, కంటి వెలుగు వడివడిగా కోటికి చేరువ అవుతున్నది.
రెండో విడతలో ఇప్పటి వరకు 47 పనిదినాల్లో మొత్తం 96,07,764 మందికి కంటి పరీక్షలు చేయగా, 60.55 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. ఇందులో 45 లక్షల మంది పురుషులు, 50 లక్షల మంది స్త్రీలు, 3,112 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. 15.65 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 11.68 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం గుర్తించడం జరిగింది. 68.73 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది.
దృష్టి లోపాలు సవరించేందుకు 2018, ఆగస్టు 15న తొలి విడుత కంటి వెలుగు ప్రారంభించారు. మెదక్ జిల్లా మల్కాపూర్ లో ప్రారంబించిన ఈ కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగింది. కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేయడం జరిగింది. ఇదే స్ఫూర్తిలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి కొనసాగిస్తున్నది.
అనుకున్న లక్ష్యం మేరకు విజయవంతంగా కొనసాగుతున్నది. 47 పనిదినాల్లో 60 శాతం మందికిపైగా కంటి పరీక్షలు చేయడం జరిగింది. లక్ష్యంగా నిర్దేశించుకన్న 100 పనిదినాల్లో రాష్ట్రంలో అందరికి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కంటి వెలుగు సమయంలో ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖలు సహా, అందరు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. పర్యవేక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నది. కంటి చూపు సరిగ్గా కనిపించక ఇబ్బందులు పడుతున్న మాకు తమ దగ్గరికే వచ్చి కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి తమ జీవితాల్లో వెలుగు నింపుతున్న ముఖ్యమంత్రి సల్లగుండాలని తమ దీవెనలిస్తున్నారు. ఈ శిబిరాలకు వచ్చే ప్రజలు ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మంచి కార్యక్రమం అని తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈకార్యక్రమాన్ని జూన్ 15 వరకు కొనసాగించనున్నారు. సెలవు దినాల్లో మినహా సిబ్బంది స్థానికంగానే అందుబాటులో ఉంటూ పరీక్షలు త్వరగా పూర్తిచేసేలా చొరవ చూపుతున్నారు. ఇచ్చిన లక్ష్యాల పూర్తికి కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో 12వేల 789 గ్రామపంచాయతీలల్లో ఇప్పటి వరకు 6,567 గ్రామ పంచాయతీలలో 52 శాతం కంటి వెలుగు లక్ష్యం పూర్తైనది. మరో 946 గ్రామ పంచాయతీలల్లో లక్ష్యానికి చేరువలో ఉన్నది. పురపాలిక సంఘాల పరిధిలోని అన్ని వార్డుల్లో రెండో విడతలో భాగంగా సుమారు2,209 వార్డుల్లో 64.03 శాతం కంటి పరీక్షలు పూర్తి చేశారు. మరో 488 వార్డులలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు 96 లక్షల 7వేల మందికి కంటి పరీక్షలు చేశారు. 15లక్షల 65 వేల మందికి ఉచితంగా రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి చుక్కల మందుతో పాటు ఏ,డి, బి కాంప్లెక్స్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
రెండవ విడత కంటివెలుగు కార్యక్రమం వంద రోజుల పనిదినాలలో కోటి 70 లక్షల మందికి కంటిపరీక్షలు నిర్వహించాలని లక్ష్యాన్ని నిర్దేశించినారు.
ఇప్పటివరకు కోటికి చేరువలో ఉన్న కంటివెలుగు పరీక్షలు త్వరలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్య అధికారులు తెలిపారు.ఇదేవిధంగా కంటివెలుగు కార్యక్రమం కొనసాగితే 2 కోట్లమందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేపట్టని కంటివెలుగు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం గర్వంగా ఉందని వైద్యాధికారులు పేర్కొన్నారు.
Tags; Close to a crore eye tests…
