Closing of more liquor stores in AP

ఏపీలో మరిన్ని మద్యం షాపులు మూసివేత

Date:09/05/2020

విజయవాడ ముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా 4380 మద్యం షాపులను 2934కి తగ్గించారు. గతంలోనే 20 శాతం షాపులు తొలగించిన ప్రభుత్వం మరో 13 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33శాతం మద్యం షాపులు తొలగించినట్లైంది.మద్యపానం నిషేధం దిశగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే 20 శాతం షాపులు తొలగించిన ప్రభుత్వం మరో 13 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 4380 మద్యం షాపులను గతంలో 3500కి తగ్గించారు.. తాజాగా షాపుల సంఖ్యను 2వేల934 కి తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెలాఖరు నాటికి షాపులు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది.. తాజా ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33శాతం మద్యం షాపులు తొలగించినట్లైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు.

 

 

 

ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు మూతపడ్డాయి. దాదాపు 45 రోజుల తర్వాత మళ్లీ ఈ నెల 4న మళ్లీ ఓపెన్ చేశారు. అలాగే మద్యం ధరల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముందు 25శాతం.. తర్వాత 50శాతం పెంచారు. మద్యపాన నిషేధంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే 13శాతం మద్యం షాపుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం షాపుల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు మద్యం అక్రమ రవాణాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)ను రంగంలోకి దించింది. సరిహద్దుల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా.. రాష్ట్రంలో సారా రూపంలో మద్యం తయారీ.. ఇసుక అక్రమాలను నిరోధించడానికి బలోపేతమైన ఈ స్వతంత్ర వ్యవస్థ రానుంది. గతంలో ఎక్సైజ్‌ కమిషనర్‌ కింద డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ పోస్టు ఉండేది.

 

 

 

తాజాగా ఎక్సైజ్‌ కమిషనర్‌ కింద ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ పోస్టు స్థానంలో స్వతంత్రంగా పనిచేసే కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) పోస్టు వస్తుంది. ఇది డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది.ఎక్సైజ్‌ విభాగంలో ఉన్న సిబ్బందిలో కొద్దిమంది ఎక్సైజ్‌ కమిషనర్‌ విభాగం కిందకు వస్తారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున లైసెన్స్‌లు, స్టాకు, విక్రయాలు, ప్రొడక్షన్‌ లాంటి రోజువారీ పాలనా అంశాలను మాత్రమే ఎక్సైజ్‌ కమిషనర్‌ చూసుకుంటారు. ఎక్సైజ్‌ విభాగంలో మిగిలిన సీఐలు, ఎస్సైలు, మిగిలిన సిబ్బంది అంతా కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)కిందకు వస్తారు. మద్యం అక్రమ తయారీ, రవాణాలను అడ్డుకోవడం వీరి ప్రధాన విధి. అలాగే ఇసుక అక్రమాలను కూడా నిరోధించడం వీరి విధుల కిందకే వస్తుంది.

కంటి ద్వారా కరోనా

Tags: Closing of more liquor stores in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *