Closure of Karnataka border roads

కర్ణాటక సరిహద్దు రహదారులు మూసివేత

6 కేసులు నమోదు

Date:24/03/2020

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలం లోని కర్ణాటక సరిహద్దు రహదారులను పూర్తిగా మూసి వేసినట్లు పుంగనూరు రూరల్ సిఐ మధుసూదన్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన కర్ణాటక సరిహద్దులతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆరు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఆయన కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించు కుండా గృహాల కే పరిమితం కావాలని కోరారు . పండగలు సైతం గృహాల కే పరిమితం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్రం సోమయాజుల పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పరిశీలించారు. ఆయనతోపాటు రామసముద్రం ఎస్ఐ రవికుమార్ ర్ సి బ్బంది పాల్గొన్నారు.

పుంగనూరు లాక్ డౌన్ 

Tags: Closure of Karnataka border roads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *