మున్నేరు బ్రిడ్జి మూసివేత
జగ్గయ్యపేట ముచ్చట్లు:
వత్సవాయి మండలం లింగాల గ్రామంలోని మున్నేరు బ్రిడ్జ్ పై అధికారులు రాకపోకలు నిలిపివేసారు. లింగాల మున్నేరు బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో లింగాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో మొన్నేరుకు వరద ప్రవాహం పెరిగింది.మరోవైపు, తెలంగాణలోని బోనకల్లు, వైరా ఖమ్మం, తోపాటు వత్సవాయి మండలం లోని సుమారు 20 గ్రామాల రాకపోకలు అంతరాయం కలిగింది. పెనుగంచిప్రోలు మున్నేరు కు వరద ప్రవాహం పెరిగింది. అమ్మవారి ఆలయం సమీపంలోని మొన్నేరు లో ఏర్పాటు చేస్తుకున్న దుకాణాల్లోకి వరదనీరు చేరింది.
Tags:Closure of Munneru Bridge

