Natyam ad

సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 గంట‌ల‌కు టీటీడీ స్థానిక ఆలయాల మూత

తిరుపతి ముచ్చట్లు:

సూర్య‌గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంట‌ల‌కు టిటిడి అనుబంధ ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను మూసివేశారు.మంగళవారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంట‌లకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags:Closure of TTD local temples at 8 am due to solar eclipse

Post Midle

Leave A Reply

Your email address will not be published.