పుంగనూరులో విద్యార్థులకు రూ.7.55 లక్షలు విలువ చేసే దుస్తులు

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1510 మంది పేద విద్యార్థులకు రూ.7.55 లక్షలు విలువ చేసే దుస్తుల టోకెన్లను ఎంఈవో వెంకట్రమణారెడ్డి విరాళంగా పంపిణీ చేశారు. గురువారం పట్టణంలో టీమ్‌ ఎవరెస్ట్ సంస్థ అధినేత మణికంఠ ఆధ్వర్యంలో వివిధ షాపుల్లో కొనుగోలు చేసిన టోకెన్లను ఎంఈవోకు అందజేశారు. ఎంఈవో పుంగనూరు, చౌడేపల్లె, పంజాణి, రామసముద్రం మండలాలకు చెందిన విద్యార్థులకు కేటాయించారు. ఎంఈవో మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం మణికంఠ ఒకొక్కరికి రూ.550లు విలువ చేసే దుస్తులు దీపావళి కానుకగా అందించారని తెలిపారు. ఈ సందర్భంగా దాతను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీలు పాల్గొన్నారు.

 

Tags: Clothing worth Rs.7.55 lakhs for students in Punganur

Leave A Reply

Your email address will not be published.