ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం సిఎం అహర్నిశలు కృషి-ఎస్సీల పై దాడులను అరికట్టండి

పోలీస్ శాఖ ను కోరిన ఎస్సీఎస్టీ కమిషన్ మెంబర్ బసవరాజ్

శిరివెళ్ళ ముచ్చట్లు:


ఆళ్లగడ్డ ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ బసవ రావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల డిఎస్పి మరియు ఆర్డీవో ల తో సమావేశం అయ్యారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేసేందుకు వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ లో ఒక నిబద్ధత కలిగిన మెంబర్ లను ఆయన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .

 

 

Post Midle

దళిత సమస్యలపై సత్వరమే పోలీసు శాఖ స్పందించి వారికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. ఇటు పోలీసు వ్యవస్థ అటు రెవెన్యూ వ్యవస్థను పారదర్శకంగా దళితుల సమస్యల పట్ల వ్యవహరించాలని వారు కోరారు నంద్యాల జిల్లా లోని సిరివెళ్ల మండల పరిధిలో చెన్నూరు గ్రామంలోని దళితులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ బస రావు దళితులతో మమేకమై వారి అడిగి తెలుసుకొని వారి సాధక బాధలలో వారు పాలుపంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బిడ్డలకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అనంతరం చెన్నూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకల్లో ఆయన పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా చెన్నూరు గ్రామంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్  బసవ రావు రాక సందర్భంగా చెన్నూరు గ్రామస్తులు మేళతాళాలతో స్వాగతం పలికి ఆయనకు పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎస్పి ఆర్డిఓ తాసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు

Post Midle
Natyam ad