నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి
-ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల ముచ్చట్లు:
సీఎం సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్ ఆన్నారు.శుక్రవారంపట్టణంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోజగిత్యాల అర్బన్,రూరల్ మండలాలకు చెందిన
18 మంది లబ్దిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 8 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్,జడ్పీ చైర్ పర్సన్ దావా వసంతతో కలసి లబ్ధిదారులకు అందజేశారు.ఈ
సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయనిధి చెక్కులను అధిక సంఖ్యలో జగిత్యాల నియోజకవర్గంలో
అందిస్తున్నామని,ఈచెక్కుల ద్వారా పేద వారికి కొంత ఆర్థికంగా అండగా ఉంటుందని,కొంత భరోసా కల్పిస్తున్నామని,చెక్కుల మంజూరుకు సహకరిస్తున్నఎమ్మెల్యే, ఎమ్మెల్యే ,ముఖ్యమంత్రి ని లబ్దిదారులు
మరవద్దని అన్నారు.ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి చాలా రోజులుగా ఉందని గతంలో ఎన్నడూ ఉమ్మడి రాష్ట్రంలో నిధులను గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని, కవితాక్కగారి సహకారం తో నేడు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో చెక్కులను పంపిణీ చేయటం జరుగుతుందని,నూటికి తొంబై తొమ్మిది మందికి లబ్ది చేకూరుతుందని,మంజూరుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రిగారికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతగతంలో వైద్యనికి నేటి వైద్యానికి చాలా తేడా ఉందని నేడు జిల్లా ఆసుపత్రిలో 60 మందికి డయాలసిస్ అందుబాటులోఉందని,ప్రసూతి,బొక్కల,ఊపిరి తిత్తులకు ఇలా అన్ని రకాల వైద్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని,జిల్లా ఆసుపత్రి సేవలను ప్రజలు ఉపయోగించు కోవాలనిసూచించారు.చెల్మెడ,ప్రతిమ లాంటి ఆసుపత్రులకు కొంత ఆరోగ్య శ్రీ లో ఎక్కువ రోగాలకు వైద్య సేవలకు అవకాశం ఉందని, ప్రజలు ఉపయోగించు కోవాలని అన్నారు.సేవ చేసే అవకాశం కల్పించిననాయకులకు,ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,ములాసపు లక్ష్మీ,జడ్పీటీసీ మహేష్,పీఏసీఎస్ చైర్మెన్ మహిపాల్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు బాలముకుందం,మండల యూత్ అధ్యకులు సురేందర్ రెడ్డి,శేఖర్,సర్పంచుల ఫోరం చెరుకు జాన్,ఎంపీటీసీలు ఫోరం అధ్యక్షులు మహేష్,సర్పంచులు,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్
రావు,ఎంపీటీసీలు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags; CM Assistance Fund for the poor