అమరావతి ముచ్చట్లు:
ఏపీ ప్రభుత్వం 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పార్టీ ఆఫీసులో విలేకరులతో చిట్ చాట్ చేసిన సీఎం, తమ ప్రాధాన్యతలు, ఉద్దేశాలను వివరించారు. రాష్ట్రంలో ఉన్న అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయని, అందుకే ప్రతి జిల్లాలో రెవెన్యూ ఫిర్యాదులు తీసుకొని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా చాలా ఉన్నాయి. వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించాల్సి ఉందన్నారు చంద్రబాబు. ప్రజలు దూర ప్రయాణాలు నుండి అమరావతి వరకు రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.సుజనా Vs బుద్ధా- ముదరక ముందే అధినాయకత్వం జోక్యం చేసుకుంటే బెటర్! ఇక తాను జిల్లా పర్యటనలు చేస్తున్న సమయంలో పోలీసుల నుండి ప్రజలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. ఇక, గత 5 సంవత్సరాల కాలంలో రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖల్లో అవినీతి చేసిన అధికారులను వదలబోమని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
Tags: CM Chandrababu 100 days target