అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

-స్కూల్ బస్సు బోల్తా ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

-బాలిక భవిష్య మృతిపై దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం

-ఫిట్ నెస్ లేకుండా బస్సులు నడుపుతున్న స్కూల్ యాజమాన్యాలపై చర్యలకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

 

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

 

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె లో సోమవారం ఓ స్కూల్ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. వెంటనే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఫిట్ నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో సోమవారం శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాల బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్ధిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు విద్యార్ధులు స్వల్పంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె నుండి 20 మంది విద్యార్ధులతో బయలుదేరిన బస్సు కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద వెనక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో రెండో తరగతి విద్యార్ధిని భవిష్య (8) మృతి చెందింది. ఈ ఘటన అనంతరం గ్రామస్తులు దాడి చేస్తారన్న భయంతో డ్రైవర్ అక్కడ నుండి పరారయ్యాడు. అయితే ఈ బస్సును యాజమాన్యం ఎలాంటి కండిషన్ లేకుండా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

Tags: CM Chandrababu asked about school bus overturn incident in Annamaiya district

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *