మందడంలో నిర్మాణాలకు పరిశీలించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu examined for the construction of the mud

CM Chandrababu examined for the construction of the mud

Date:19/05/2018
అమరావతి ముచ్చట్లు:
శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. మందడం లో నిర్మిస్తున్న గృహ సముదాయాలను సందర్శించారు.  మందడం సమీపంలో సీడ్ ఎక్స్ సిస్ 8 రోడ్ల రహదారి పై నిర్మిస్తున్న  వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. రాయపూడి లో నిర్మిస్తున్న ఐ ఎ ఎస్, మంత్రుల గృహ సముదాయాలు, నెలపాడు గ్రామంలో నిర్మాణం లో ఉన్న సెక్రటేరియట్ ఉద్యోగుల, నాల్గోవ తరగతి ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణాలను, నమూనాలను, డిజైన్లు పరిశీలిచారు. సెక్రటేరియట్ భవన సముదాయం నుంచి వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు.తరువాత అయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని లో మొత్తం 32 రహదారులు సుమారు 320 కి.మీ. వస్తాయి. ల్యాండ్ పూలింగ్ చేపడుతున్న నిర్మాణాలలో ఆరు పనులు జరుగుతున్నాయని అన్నారు. ఎన్జీఓ లకు చెందిన 1980 ఇళ్లు నెలపాడులో నిర్మిస్తున్నాం. అల్యూమినియం మెటీరియల్ తో షేర్ వాల్ టెక్నాలజీ తో పకడ్బందీగా నిర్మాణాలు చేపడుతున్నాం. జిల్లా కోర్ట్ నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిలో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్వహిస్తాం. ఇప్పటి వరకు రూ.24 వేల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతోందని అన్నారు. కొందరు అనవసర ప్రచారం చేస్తున్నారు, రాష్ట్రం ఖర్చు చేసే మొత్తం నుంచి కేంద్రానికి ఆదాయం వస్తోంది.  విమర్శకులకు విజ్ఞప్తి చేస్తున్నా, సహకరించండని కోరుతున్నా, అభివృద్ధి లో భాగస్వామ్యం అవ్వండని అన్నారు. ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి, వొచ్చే ఆరు నెలల్లో నిర్మాణాలపై ఒక అవగాహన కలుగుతుంది, సమస్యలను ఎదుర్కొంటు ముందుకు వెళుతున్నామని అన్నారు. ఎక్కడ తక్కువ వడ్డీకి వొస్తే అక్కడ నుంచి బాండ్ రూపంలో నిధులు సమీకరించి అభివృద్ధి చేపడతామని సిఎం అన్నారు.
Tags:CM Chandrababu examined for the construction of the mud

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *