పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు

CM Chandrababu in Puttaparthi

CM Chandrababu in Puttaparthi

Date:23/11/2018
పుట్టపర్తి ముచ్చట్లు:
సత్యసాయిబాబా అందించిన మహా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి. మానవ సేవయే మాధవ సేవ అనే ప్రపంచానికి చాటిన వ్యక్తి బాబా. సత్యసాయిబాబా తో నాకు ఉన్న అనుబంధం అపురూపమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రఅన్నారు. శుక్రవారం నాడు అయన సత్యసాయి బాబా 93 వ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో పలువులుమంత్రులు కాల్వ ,దేవినేని ఉమా, పరిటాల సునీత, జౌహార్ ,శిద్దా రాఘవరావు, ప్రభుత్వ చీఫ్ విప్ లు పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవ్ , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ట్రస్ట్ సభ్యులు పాల్గోన్నారు. అంతకుముందు అయన సాయి కుల్వంత్ హాల్ లో బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రశాంతి నిలయానికి వచ్చే ప్రతి భక్తునికి మన్నాశాంతి తో పాటు తమ సమస్యకు పరిస్కారం దొరుకుతుంది. నేటికి ఆనాటి కి ఎటువంటి క్రమ శిక్షణ లో మార్పులేని ఏకైక సంస్థ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. ప్రపంచ దేశాల్లోని అన్ని సంస్థలకు ఆదర్శంగా నిలిచేది సత్యసాయి ట్రస్ట్ అని కొనియాడారు. ఉన్నత స్థాయి చేరాలన్న ప్రతి వ్యక్తి బాబా సూక్తులను మార్గాలను పాటిస్తే తమ గమ్యానికి చేరుకుంటారు. ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలని అనిపించలేదు. వచ్చిన ప్రతిసారి మహోన్నతమైన శక్తిని అనుభూతిని పొందుతున్నాను. బాబా మన మధ్య లేకపోయినా ఇప్పుడు మనందరి లో బాబా జీవించి ఉన్నాడు. నాకు సమయం దొరికినప్పుడల్లా పుట్టపర్తి కి విచ్చేయాలని ఉంది. సత్యసాయిబాబా అనుగ్రహం తోనే పుట్టపర్తి కి రాగలం. .అందుకే బాబా పిలుపుతో వచ్చానని అన్నారు.
Tags:CM Chandrababu in Puttaparthi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *