పోలవరం ప్రాజెక్టు పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి  ముచ్చట్లు:

 

రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరం – వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం – మేధావులు, నిపుణులతో సహా అందరి సలహాలు తీసుకుంటాం – ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి – ప్రజలు గెలిచారు.. ఇక రాష్ట్రాన్ని నిలెబ్టాలి – ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం – కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి – 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది – వెబ్ సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతాం – దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాల విడుదల – పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం – సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం – రాష్ట్రానికి పోలవరం, అమరావతి రెండు కళ్లు – పోలవరాన్ని జగన్ నాశనం చేశారు – పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహం – రాష్ట్ర అభివృద్ధికి జలవిద్యుత్ కీలకం – విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టం ఎక్కువ – ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయ రంగానికి ఊతం వస్తుంది – 2014-19 మధ్య పోలవరానికి రూ.11,762 కోట్లు ఖర్చు చేశాం – వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది – జగన్ మూర్ఖత్వంఓ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది – జగన్ ప్రమాణం చేస్తూనే పోలవరం పనులు ఆపేశారు – ప్రత్యామ్నాయం లేకుండానే కాంట్రాక్టర్లను తొలగించారు – సమర్థులైన అధికారులను బదిలీ చేశారు – డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని హైదరాబాద్‍ ఐఐటీ బృందం చెప్పింది – డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం జగన్‍కు రెండేళ్ల తర్వాత తెలిసింది – కాంట్రాక్టర్లను మార్చవద్దని పీపీఏ హెచ్చరించింది – 2009లోనూ వైఎస్ కాంట్రాక్టర్‍ను మార్చారు – వైఎస్ కాంట్రాక్టర్‍ను మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచాయి – వైఎస్ చేసిన తప్పే జగన్ కూడా చేశారు – పీపీఏ హెచ్చరికలను జగన్ పెడచెవిన పెట్టారు – 2019 ఆగస్టు 16న సీఎస్‍కు పీపీఏ లేఖ రాసింది – ఏజెన్సీలను మార్చవద్దని పీపీఏ స్పష్టంగా చెప్పింది – నీతిఆయోగ్ బృందం నాటి సర్కారు తప్పిదాలను ఎత్తిచూపింది – కాఫర్‍ డ్యామ్ గ్యాప్‍లు పూర్తిచేసేటప్పుడు ఏజెన్సీని మార్చారు – 2018లో డయాఫ్రమ్‍వాల్‍ను రూ.436 కోట్లతో పూర్తిచేశాం – డయాఫ్రమ్‍వాల్ మరమ్మతులకే రూ.447 కోట్లు ఖర్చయ్యింది – కొత్త డయాఫ్రమ్‍వా నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుంది – కొత్త డయాఫ్రమ్‍వాల్ నిర్మాణానికి కనీసం 2 సీజన్లు అవసరం – కాఫర్ డ్యామ్ సీపేజ్ వల్ల ఏ పనులూ చేసే పరిస్థితి లేదు – జగన్ విధ్వంసంతో ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు మారాయి – జగన్ ప్రభుత్వ అసమర్థతతో గైడ్‍బండ్ కుంగిపోయింది – రూ.80 కోట్లతో నిర్మించిన గైడ్‍బండ్ నిరుపయోగంగా మారింది – టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తయింది – టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తయింది – వైసీపీ హయాంలో 3.84 శాతం పనులే జరిగాయి – పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.3,385 కోట్లు మళ్లించారు – టీడీపీ హయాంలో ప్రశంసలు దక్కాయి – వైసీపీ హయాంలో పీపీఏ, ఐఐటీ నిపుణుల చివాట్లు దక్కాయి – పోలవరాన్ని జగన్ గోదావతిలో ముంచారు – పోలవరం మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నిపుణులను రప్పిస్తున్నాం – అమెరికా, కెనడా నిపుణులు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారు – ఏజెన్సీని మార్చకపోతే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేది -జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.4,900 కోట్ల నష్టం జరిగింది – జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఖర్చు 38 శాతం పెరిగింది – జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి కోల్పోయాం – విద్యుదుత్పత్తి కోల్పోవడం ద్వారా రూ.3 వేల కోట్లు నష్టపోయాం – పోలవరం ఆలస్యంతో రైతులకు రూ.45 వేల కోట్లు నష్టం జరిగింది – అంతర్జాతీయ, దేశీయ నిపుణుల సాయంతో సమస్యను అధిగమిస్తాం – కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో సవాళ్లు అధిగమిస్తాం – ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మతు ఇంకా కష్టమైన పని – పోలవరం కోసం మేం పడిన శ్రమను జగన్ వృథా చేశారు – అర్హత లేనివారికి అధికారం వస్తే అరాచకాలే జరుగుతాయి – కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉందో తెలియనివారు మాపై విమర్శలు చేశారు – పోలవరాన్ని ఎంతకాలంలో బాగు చేస్తామో నిపుణులే తేల్చాలి – పోలవరంలో తప్పులు చేసిన అధికారులను మారుస్తున్నాం – పోలవరంలో ప్రధాన దోషిని జనం ఇంటికి పంపారు – పోలవరం ఎత్తు విషయంలో రాజీ లేదు – పోలవరాన్ని చూస్తే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి : సీఎం చంద్రబాబు

 

 

 

 

Tags:CM Chandrababu released a white paper on the Polavaram project

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *