చురుగ్గా పునరావాసం అధికారులతో సీఎం చంద్రబాబు

CM Chandrababu with active rehabilitation officers

CM Chandrababu with active rehabilitation officers

Date:11/10/2018
అమరావతి ముచ్చట్లు:
ఉత్తరాంధ్ర ని వణికించిన తిత్లీ తుపాన్ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ నేలకూలిన చెట్లను వెంటనే తొలగి0చాలి. కట్టర్లు,వర్కర్లను సిద్ధం చేసుకోవాలి. నదుల్లో వరద ప్రవాహం పరిశీలించాలి. కాలువలకు గండ్లు పడకుండా చూడాలని ఆదేశించారు.. ఇకపై ప్రతి గంటా మనకు ముఖ్యం. సహాయ పునరావాస చర్యలే అత్యంత కీలకం.అన్ని శాఖల యంత్రాంగం చురుగ్గా పాల్గొనాలి. విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతం చేయాలి. కరెంట్ స్థంభాలను వెంటనే పునరుద్దరించాలి. ఎన్ డిఆర్ ఎఫ్,ఎస్ డిఆర్ ఎఫ్,కోస్టల్ గార్డుల సేవలు వినియోగించుకోవాలి. దెబ్బతిన్న రహదారులను వెంటనే పునరుద్దరించాలి.  రోడ్లపై గండ్లు వెంటనే  పూడ్చాలి.
యుద్ధప్రాతిపదికన రాకపోకలు పునరుద్దరించాలని సూచించారు. ఇతర జిల్లాలనుంచి సిబ్బందిని శ్రీకాకుళానికి తరలించాలి. మరోవైపు, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి.  పారిశుద్ధ్య చర్యలు  చేపట్టాలి. జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలి.తుపాన్ బాధితులకు సేవలు అందించాలి.సహాయ పునరావాస చర్యలలో భాగస్వాములు కావాలి. బాధితులకు తాగునీరు,భోజన పాకెట్లు పంపిణీ చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలి. తుపాన్ బాధితులకు అండగా నిలబడాలి. అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎక్కడికక్కడ ప్రతిశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి.క్షేత్రస్థాయిలో సిబ్బందితో  సమన్వయం చేసుకోవాలి. సాయంత్రానికల్లా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని చంద్రబాబు సూచించారు.
Tags:CM Chandrababu with active rehabilitation officers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *