ఏపీలో ఈనెల 16న సీఎం చంద్రబాబు కేబినెట్‌ సమావేశం

అమరావతి ముచ్చట్లు:

 

ఈనెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లోని ఫస్ట్ బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ సమావేశంలో చర్చించే అంశాలను ఈ నెల 11న సాయంత్రం 4 గంటల లోపు శాఖలవారీగా అందజేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర మంత్రులు పాల్గొననున్నారు.

 

Tags: CM Chandrababu’s cabinet meeting on 16th of this month in AP

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *