CM financial assistance Rs 55 thousand

సీఎం ఆర్థిక సహాయం రూ.55 వేలు

Date:11/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద రూ.55 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. పట్టణానికి చెందిన ఇర్షాద్‌బేగం శ్వాసకోశ వ్యాధితో బాధపడుతోంది. ఆపరేషన్‌కు లక్షరూపాయలు అవసరమన్న విషయాన్ని ముస్లిం నేతలు ఫకృద్ధిన్‌షరీఫ్‌, అమ్ము కలసి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి నివేదికలను సీఎం రిలీఫ్‌ఫండ్‌కు పంపి నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు చెక్కును షరీఫ్‌, అమ్ము కలసి బాధితురాలు ఇర్షాద్‌బేగంకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందించిన సీఎంకు, మంత్రి పెద్దిరెడ్డికి కృత జ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు ఖాజా, జాఫర్‌ పాల్గొన్నారు.

కరోనా వ్యాధి గ్రస్తులను ఆదరించండి

Tags; CM financial assistance Rs 55 thousand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *