ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ కుమార్తె వివాహానికి హజరయిన సీఎం జగన్
కాకినాడ ముచ్చట్లు:
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహం నిమిత్తం గురువారం ఉదయం కాకినాడ జిల్లా తునిలో రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు వ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. అయనకు రాష్ట్ర మంత్రులు, శాసనమండలి, శాసన సభ్యులు, జిల్లా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, శాసనమండలి సభ్యులు పండుల రవీంద్రబాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ దవులూరి దొరబాబు,
పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, కురసాల కన్నబాబు, కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా, అనకాపల్లి జిల్లా కలెక్టరు రవికుమార్ పటాన్ శెట్టి, కాకినాడ ఎస్పీలు ఎం.రవీంద్రనాథ్ బాబు,తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు, పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు, పెందుర్తి శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్ రాజ్, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివ ప్రసన్న, తుని పురపాలక సంఘం చైర్ పర్సన్ ఏలూరి సుధారాణి, ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఎన్.సోనివుడ్, కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఇతర ప్రజాప్రతినిధులు తుని పురపాలక సంఘం కౌన్సిలర్లు, రాజకీయ ప్రముఖులు అయనను కలిసిన వారిలో ఉన్నారు..
Tags: CM Jagan attended SC Corporation Chairman’s daughter’s wedding