Natyam ad

విద్యారంగాన్ని కొత్తపుంతలు తొక్కించిన సీఎం జగన్…

-57 నెలల్లో రూ 73 వేల కోట్లును విద్యాపథకాలకు వ్యయం..

 

రామాపురం ముచ్చట్లు:

Post Midle

రామాపురం మండలం నీలకంఠ రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.1.60 కోట్ల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి.విప్లవాత్మక మార్పులతో రాష్ట్రంలో విద్యారంగాన్ని సీఎం జగన్ కొత్తపుంతలు తొక్కించారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.శనివారం
రామాపురం మండలం నీలకంఠ రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.1.60 కోట్ల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభంలో ముఖ్య అతిధిగా ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అదనపు గదుల ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి కి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికి ఆయన చేత శిలాఫలకం ఆవిష్కరణ చేయించారు.

 

ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ విప్లవం పరుగులు పెడుతోంది.తరగతి గదుల్లో… డిజిటల్ విద్యను బోధించిన శ్రీకాంత్ రెడ్డి పాఠశాల తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులతో శ్రీకాంత్ రెడ్డి మమేకమయ్యారు.డిజిటల్ తరగతుల వల్ల కలిగే మేలును ఆయన వివరించారు.స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీల ద్వారా పాఠ్యాంశాల బోధన విజయవంతంగా సాగుతోందన్నారు .దీనివల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతోందన్నారు.సర్కారు బడుల్లో డిజిటల్‌ కాంతులు ఇంద్రధనుస్సులై శోభిల్లుతున్నాయన్నారు.

 

 

తరగతి గదుల్లో చదువుల జాతరకు తెరతీస్తూ,బంగారు భవితకు బాటలు వేస్తున్నాయన్నారు. డిజిటల్‌ బోధన వల్ల ఉపాధ్యాయుల పని సులువైందన్నారు. స్క్రీన్‌పై చూపించి చెప్పడం వల్ల విద్యార్థులు వెంటనే అర్థం చేసుకుంటున్నారన్నారు. ఇది గొప్ప విప్లవాత్మక మార్పు.స్మార్ట్‌ టీవీల ద్వారా బోధించడం వల్ల పాఠాలు బాగా అర్థమవుతున్నాయన్నారు.గతంలో బోర్డుపై రాసి తుడిపేయడం వల్ల మళ్లీ టీచర్‌ని అడగాలంటే ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు మళ్లీ అడిగినా టీచర్లు సులభంగా స్క్రీన్‌పై చూపించి చెబుతున్నారన్నారు.ఐ బి ప్రమాణాలను తీసుకువస్తున్నారన్నారు. బైజుస్ కంటెంట్ తో కూడిన ట్యాబులును అందిస్తున్నారన్నారు.

విద్యాపథకాలకు రూ 73 వేల కోట్ల వ్యయం…

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులును సీఎం జగన్ తీసుకు వచ్చారన్నారు. విద్యా రంగంలో 57 నెలల కాలంలో కేవలం పథకాల మీద రూ.73 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం ఒక చరిత్ర అని అన్నారు.పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నారన్నారు.రూ 12 వేల కోట్ల నిధులతో నాడు నేడుతో పాఠశాలల అభివృద్ధి పనులు.రూ 12 వేల కోట్ల నిధులతో నాడు నేడుతో పాఠశాలల అభివృద్ధి పనులును జగన్ ప్రభుత్వం చేసిందన్నారు. పిల్లలకు ఇచ్చే మంచి ఆహారం నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులే లక్ష్యంగా నడుస్తోందన్నారు.

 

 

పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా.. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో నేరుగా ‘జగనన్న విద్యా దీవెన’ ప‌థ‌కం ద్వారా జమ చేస్తున్నది జగనన్న ప్రభుత్వమన్నారు.ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా.. ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ‘జగనన్న వసతి దీవెన’ ప‌థ‌కం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందన్నారు.

 

 

 

పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని జనవరి 9, 2020న ప్రారంభించారని, 1వ తర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దివే పిల్ల‌ల‌కు జగనన్న అమ్మ ఒడి పథకం వ‌ర్తిస్తుందని, ఈ పథకం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పిల్లలను ఎక్కడ చదివించినా, ప్రతి ఏడాది జనవరిలో నేరుగా పథకానికి ఎంపికైన అర్హులైన తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేయడం జరుగుతొందన్నారు. అమ్మఒడి పథకానికి టెక్నాలజీని అనుసంధానం చేసిందని, దీని ద్వారా పిల్లలు బడికి రాకపోతే మొదటి రోజు తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందని, వరుసగా రెండు రోజులు రాకుంటే మూడో రోజు వలంటీర్‌ నేరుగా ఇంటికి వచ్చి పిల్లల యోగ క్షేమాలను విచారిస్తారని పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదైతే తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఉన్న ఉద్యోగులు, వలంటీర్లు, పేరెంట్స్‌ కమిటీతో పాటు టీచర్ల మీద ఉంచిందన్నారు.కోవిడ్‌ మహమ్మారి లాంటి సమయంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తే, ప్రభుత్వ బడులలో చదివే పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్ధేశ్యంతో 2022 విద్యాసంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కోరుకుంటే అమ్మఒడి ద్వారా ఇస్తున్న నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ తీసుకునే విధంగా ఈ పథకంలో కొత్త ఆప్షన్‌ను చేర్చారన్నారు.పిల్లలను బడికి పంపితే చాలు మిగిలిన అన్ని విషయాలను ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు.

 

 

విద్యార్థుల తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు సర్కారు బడిలో చదివే పిల్లలకు విద్యాకానుక రూపంలో 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యాకానుక’ ప్రత్యేక కిట్లు అందజేస్తున్నారన్నారు. వాటిలో విద్యార్థి తరగతికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌బుక్స్‌, ఆక్స్‌ఫర్డ్‌, పిక్టోరియల్‌ డిక్షనరీ, మూడు జతల యూనిఫాం, బూట్లు, బెల్ట్‌, స్కూల్‌ బ్యాగ్‌ అందిస్తున్నారన్నారు.విజ్ఞానపు బొమ్మలతో ఆసక్తి కలిగించే క్లాస్ రూమ్లు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ క్లబ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు.. ఇలా వైఎస్సార్సీపీ పాలనలో స్పష్టంగా కనిపించిన మార్పు అన్నారు.దీంతో దశాబ్దాల తరువాత రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారిపోయాయన్నారు.

 

 

 

పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన శ్రీకాంత్ రెడ్డి
పదవ తరగతి విద్యార్థులకు శ్రీకాంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ప్రణాళికా బద్దంగా చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్ జె డి రాఘవ రెడ్డి, డిఈఓ శివ ప్రకాష్ రెడ్డి,జెడ్ పి టి సి మాసన వెంకట రమణ,మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాధ రెడ్డి, వైస్ ఎంపిపి లు రవిశంకర్ రెడ్డి, బాబు, సర్పంచ్ అంజూమ్ సుల్తానా, ఆయూబ్, మాజీ ఎంపిపి నసిరూన్ సుల్తానా, సింగల్ విండో అధ్యక్షుడు పెద్దిరెడ్డి,విశ్రాంత ఉపాధ్యాయుడు అబ్దుల్ హుసేన్,జహరుద్దీన్, ఖతీబ్ బేగ్,మాజీ ఎంపిటిసి రామసుబ్బారెడ్డి,సర్పంచులు అయోధ్యాపురం నాగభూషణ రెడ్డి,వెంకట రెడ్డి,రఘు రామయ్య, శివ, రామాంజులు, మునీర్, మాజీ సర్పంచ్ మురళీ మోహన్ రెడ్డి,మాజీ ఎంపిటిసి హరినాధ రెడ్డి, నాయకులు
రషీద్, సహదేవ రెడ్డి,వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు,మాజీ వైస్ ఎంపిపి మురళీ రెడ్డి, దర్బార్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సగినాల శివశంకర్,శ్రీను,యువజన విభాగం సూరం వెంకట సుబారెడ్డి, నాగేంద్ర రెడ్డి, పాఠశాల కమిటీ ఛైర్మన్ ఇంతియాజ్, రియాజ్, నియాజ్,జాఫర్,సిరాజ్,చెన్నారెడ్డి,యోగాంజులు రెడ్డి ఇర్షాద్,నియామతుల్లా,మహేష్,పురుషోత్తం రెడ్డి, జిలాన్, శివ,కరెంట్ బాష, షఫీ, సత్యాయాదవ్,కనపర్తి చెన్నారెడ్డి,డీలర్ ఆర్తీఫుల్లా,హక్,దర్బార్ బాష, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: CM Jagan broke new ground in the field of education…

Post Midle