Natyam ad

చుక్కల భూముల దశాబ్దాల సమస్యకు చెక్ పెట్టిన సీఎం జగన్

నెల్లూరు  ముచ్చట్లు:

చుక్కల భూములపై సర్వ హక్కలు రైతులకే.రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మనది.ఎన్నికల కోసమే ప్రతిపక్షాల్లో రైతులపై ప్రేమ.. చంద్రబాబు,పవన్ కల్యాణ్‌పై సీఎం వ్యంగ్యాస్త్రాలు.*నేటి డీబీటీలే మన హ్యూమన్ క్యాపిటల్.చంద్రబాబుకి ఒటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే: సీఎం జగన్.చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించేలా సీఎం జగన్ రైతన్నలకు పట్టాలు పంపిణి చేశారు. దశాబ్దాల సమస్యకు చెక్ పెడుతూ.. శుక్రవారం నాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుంచి తొలగించే విధంగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలుగుతుంది. దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలగుతాయి.

 

 

Post Midle

రైతులు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ఈ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిషేధిత జాబితా నుంచి సీఎం జగన్ తొలగించారు. జిల్లా కలెక్టర్ల ద్వారా చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫై చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయి. వారు వాటిని అమ్ముకొనేందుకు, రుణాలు పొందడానికి, తనఖాకు, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కలిగుతుంది. వీటిపై రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం రైతులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902 సంప్రదించవచ్చు.రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మనది: సీఎం జగన్.”97,470 రైతు కుటుంబాలకు మంచి చేసేలా, 2లక్షల, 6 వేల 170 ఎకరాలు రికార్డుల్లో నమోదు చేశాం. రైతు బాగుంటే.. రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనది. రైతులందరికి చుక్కల భూముల పై పూర్తి హక్కులు కల్పించాం. రైతన్నల కష్టం నేను చూశాను.. మీకు నేను ఉన్నాను. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోంది. భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నాం. దేశంలో ఎక్కలేని విధంగా భూసర్వే చేస్తున్నాం. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎంతో మేలు చేశాం. నాలుగేళ్లుగా ప్రతి అడుగు రైతన్నలకోసమే వేశాం.” అని.. మనది రైతు పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఎన్నికల కోసమే ప్రతిపక్షాల్లో రైతులపై ప్రేమ

రైతుల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశాడని జగన్ మండిపడ్డారు. దాని పై ఈ దత్తపుత్రుడు, పచ్చ మీడియా ఒక్క మాట కుడా అనలేదని విమర్శించారు. ప్రశ్నిస్తా అని చెప్పిన ప్రశ్నించటమే మానేశారని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఒక వైపు, బాబు స్కీప్టులను డైలాగులుగా చెబుతున్న ప్యాకెజీ స్టార్ ఒక వైపు, వీరి డ్రామాను రక్తికట్టించేందుకు పచ్చ మీడియా ఒక వైపు డ్రామాలు వేస్తున్నారని రైతన్నలు, వీళ్ల డ్రమాలను నమ్మవద్దని జగన్ కోరారు.

నేటి డీబీటీలే మన హ్యూమన్ క్యాపిటల్: సీఎం జగన్

డీబీటీ ద్వారా రూ 2.10 లక్షల కోట్లు నేరుగా జమ చేశామని, ఇది మానవ వనరుల పై పెట్టుబడి అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో డ్రైవర్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడి ఉద్యోగం సంపాదించే రోజు వస్తుంది. లంచాలు, వివక్షకు తావులేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.

చంద్రబాబుకి ఒటేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే: సీఎం జగన్

చంద్రబాబుకి ఒటు వేస్తే సంక్షేమ పథకాలు నిలచిపోతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. వీళ్ల విధానం డీపీటీ.. పంచుకో, తినుకో, దోచుకో.. జీవీ రావు చార్టర్ అకౌంటెంట్ సర్వీస్ రద్దయిందని ఇలాంటి దానయ్యకు కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపించారని విమర్శించారు. చంద్రబాబు మనసులో మాటలను వీళ్లతో చెప్పిస్తున్నారని అన్నారు. పేదలందరికి ఇళ్లు ఇస్తుంటే వీళ్లకి కడుపు మంట అని మండిపడ్డారు.

 

Tags: CM Jagan checked the problem of dotted lands for decades

Post Midle