Natyam ad

అంబేద్కర్ విగ్రహం నెలకొల్పి చరిత్ర సృష్టించిన సీఎం జగన్

-సమ సమాజ స్థాపకుడు అంబేద్కర్
-గూడెం’లో అంబేద్కర్ విగ్రహాలకు పాలు,  పూలాభిషేకాలు
-డిప్యూటీ సీఎం కొట్టు సారధ్యంలో విస్తృత కార్యక్రమాలు

తాడేపల్లిగూడెం ముచ్చట్లు:

Post Midle

విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి అందులో 125 అడుగుల ఎత్తు గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని పలువురు ఉద్ఘాటించారు. భారతదేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో ఇది రెండవ అతి పెద్ద విగ్రహంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. గత పాలకులు అంబేద్కర్ విగ్రహం నెలకొల్పుతామని మాటలు చెప్పడమే తప్ప చేతల్లో చేసి చూపించింది లేదని విమర్శించారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుమారు 400 కోట్ల రూపాయలు వ్యయంతో విజయవాడ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్వరాజ్ మైదానం లో స్థలాన్ని కేటాయించి అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అందులో 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ పట్ల వైకాపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీన 125 అడుగులు ఎత్తు గల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ముందస్తు కార్యక్రమాలలో భాగంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారధ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విస్తృత కార్యక్రమాలు చేపట్టారు.

 

 

 

ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం కొట్టు సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. వైకాపా యూత్ లీడర్ కొట్టు విశాల్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ స్మృతి వనం పోస్టర్లను ఆవిష్కరించారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం నియోజకవర్గంలో అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో 125 అడుగులు ఎత్తు గల అంబేద్కర్ విగ్రహం ఫోటో ఫ్రేమ్ లను ఏర్పాటు చేశారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలను శుభ్రంగా కడిగించి, రంగులు వేయించి పూలదండలతో అలంకరించారు. పువ్వులు, పాలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రతిజ్ఞ చేసి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. పెంటపాడు, తాడేపల్లిగూడెం టౌన్ లోని పోలీస్ ఐలాండ్, తాలూకా ఆఫీస్ సెంటర్లలో గల విగ్రహాలకు, రూరల్ మండలం చినతాడేపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ చీకటిమిల్లి మంగరాజు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, యూత్ లీడర్ కొట్టు విశాల్, తాడేపల్లిగూడెం ఆర్డీవో కే.చెన్నయ్య తదితర ప్రముఖులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పెంటపాడు లో అంబేద్కర్ విగ్రహానికి కొట్టు విశాల్ పాలాభిషేకం చేశారు.

 

 

 

స్థానిక ఓవర్ బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు ఎస్సీలను హేళన చేశాడని గుర్తు చేశారు. అలాగే తుళ్లూరు తుప్పల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేసి వదిలేసిన నీచ చరిత్ర చంద్రబాబుకు ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించని రీతిలో విజయవాడ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్వరాజ్ మైదానం స్థలంలో 400 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 125 అడుగుల అతి ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నారు అన్నారు.

 

 

 

దీనికోసం వేసిన మంత్రుల కమిటీలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా ఉన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ను ఒక సభ్యుడిగా నియమించడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన 125 అడుగులు ఎత్తు గల భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలను రూపొందించారన్నారు. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను కడిగి శుభ్రం చేసి రంగులు వేయడం, పాలు, పూలతో అభిషేకాలు నిర్వహించడం, ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం ఫోటో ఫ్రేమ్ లను ఆవిష్కరించడం వంటి ముమ్మర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

 

Tags:CM Jagan created history by erecting Ambedkar’s statue

Post Midle