ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్
గుంటూరు ముచ్చట్లు:
వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్ జగన్ స్వయంగా ట్రాక్టర్ను నడిపారు. గుంటూరు జిల్లాలోని చుట్టగుంట వద్ద ‘వైఎస్సార్ యంత్ర సేవ పథకం’ రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్నిజెండా ఊపి ప్రారంభించారు.
Tags: CM Jagan driving a tractor

