Natyam ad

రూ.111.62 కోట్ల వ్యయంతో 165 పశు సంచార అంబులెన్సులు జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్

మొత్తం రూ.240.69 కోట్ల వ్యయంతో అందుబాటులో 340 అంబులెన్స్‌లు

డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవలు మరింత విస్తృతం

 

తాడేపల్లి ముచ్చట్లు:

Post Midle

రాష్ర్టంలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ర్ట ప్రభుత్వం మరో అడుగు ముందడుగు వేసింది. డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ కింద రెండోదశలో భాగంగా రూ.111.62 కోట్ల వ్యయంతో 165 పశు అంబులెన్స్ వాహనాలను బుధవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంచార పశు ఆరోగ్యసేవ వాహనం ఎక్కి పనితీరు, సేవలను స్వయంగా పరిశీలించారు.

ఇప్పటికే మొదటి దశలో రూ.129.07 కోట్ల వ్యయంతో 175 పశుఅంబులెన్స్‌ల అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఇప్పుడు రెండో దశలో భాగంగా రూ.111.62 కోట్ల వ్యయంతో ఇవాళ మరో 165 పశు అంబులెన్స్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటయ్యాయి. మొదటి దశలో ప్రారంభమైన 175 పశుఅంబులెన్స్‌ల ద్వారా 1,81,791 పశువులను ప్రాణాపాయం నుంచి రక్షించి 1,26,559 మంది పశు పోషకులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.

కార్యక్రమంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్‌ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల గిరి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌ నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: CM Jagan flagged off 165 Cattle Transport Ambulances at a cost of Rs.111.62 crores

Post Midle