ఎమ్మెల్సీ అభ్యర్దులకు బీ ఫారం అందచేసిన సీఎం జగన్
అమరావతి ముచ్చట్లు
ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్ధులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం బి–ఫారంలు అందజేసారు. ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు మర్రి రాజశేఖర్, వివి సూర్యనారాయణ రాజు పెన్మత్స, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కలిసి బి–ఫారంలు అందుకున్నారు. శాసనమండలి సభ్యులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ అభ్యర్ధులు కృతజ్ఞతలు తెలిపారు. .

Tags:CM Jagan gave B form to MLC candidates
