Divine Parents who met Jagan

దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్

Date:21/10/2020

విజయవాడ  ముచ్చట్లు:

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి సిఎం జగన్ పట్టువస్త్రాలను సమర్పించారు.మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న జగన్ పసుపు కుంకుమలను సమర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో జగన్కు ఘనస్వాగతం పలికారు.ప్రత్యేకపూజలు అనంతరం అమ్మవారి తీర్ధప్రసాదాలను ఆలయ పూజారులు సిఎం జగన్ కు అందించారు.అనంతరం కొండమీదకు చేరుకున్న సీఎం జగన్ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్కు వివరించారు.

బీసీలకు గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్‌ రుణంతీర్చుకోలేం

Tags: CM Jagan in the presence of Durgamma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *