Natyam ad

రూ.224 కోట్ల ఖర్చుతో నిర్మించిన లక్కసాగరం పంప్‌హౌస్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

-చంద్రబాబు పాలనలో రాయలసీమపై కక్ష.. మన ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులతో కరువు నేల సుభిక్షం

-3 నియోజకవర్గాల్లో 77 చెరువులకు జలకళ.. రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించాం.. వెలిగొండ ప్రాజెక్ట్ ను వడివడిగా పూర్తి చేస్తున్నాం

-రాష్ట్రాన్ని దోచుకుని, పంచుకోవటానికే చంద్రబాబు, దత్తపుత్రుడు పొత్తుల కుట్రలు.. సీఎం జగన్

 

Post Midle

కర్నూలు  ముచ్చట్లు:

” చంద్రబాబు నమ్మకం అతని పాలన కాదు, చంద్రబాబు నమ్మకం దత్తపుత్రుడు, ఎల్లో మీడియా. చంద్రబాబు ఉద్దేశం కేవలం దోచుకోవడం, పంచుకోవటం తినటం మాత్రమే. దానికి దత్తపుత్రుడికి పంచిపెట్టడం మినహా మరేం జరిగింది. ప్రశ్నిస్తా అని వచ్చిన వ్యక్తి ఎందుకు ప్రశ్నించటంలేదు. ఎల్లో మీడియ ఎందుకు నిజాన్ని చూపించటం లేదు. చంద్రబాబు కుట్రలు, కుతాంత్రాలతో దుర్మార్గమైన పాలన చేశారు. రానున్న రోజుల్లో వీరు మర్ని అబద్దాలతో మీ ముందుకు వస్తారు, నమ్మవద్దు. అందరికీ సామాజికన్యాయం అందించటమే మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం, మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు తోడుగా నిలబడండి” – సీఎం జగన్

 

 

 

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మంగళవారం నాడు సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కరువు నేలను సస్యశ్యామలం చేస్తూ రూ.224 కోట్లతో నిర్మించిన లక్కసాగరం పంప్‌ హౌస్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద నిర్మించిన లక్కసాగరం పంప్‌హౌస్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత డోన్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. లక్కసాగరం పంప్‌హౌస్‌ ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి సాగు, తాగునీరు సరఫరా కానున్నాయని, దీని ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 77 చెరువులు జలకళను సంతరించుకోనున్నాయని సీఎం తెలిపారు. ఈ పంప్‌హౌస్‌ వల్ల 10,394 ఎకరాలకు సాగు నీరు, 3 నియోజకవర్గాలకు తాగు నీరు అందనుందన్నారు. ఈ . కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా నూతన ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు. లక్కసాగరం కోసం మన ప్రభుత్వం రూ.224 కోట్లు ఖర్చు చేసిందని, రైతుల మంచి చేసేందుకు ముందుంటామని పేర్కొన్నారు.

 

 

 

 

సీమ నీటి కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది

నీటి విలువ‌, రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన ప్ర‌భుత్వం కాబ‌ట్టే అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చంద్ర‌బాబు ఎన్నికలకు 4 నెలలకు ముందు జీవోలు, శంకుస్థాపనలు చేశారని, ప్రాజెక్ట్‌ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదని, కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామ మాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశార‌ని సీఎం విమ‌ర్శించారు.

 

 

 

గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పత్తికొండ నియోజకవర్గంలోని 27 గ్రామాలకు, కృష్ణగిరి మండలంలోని 55 గ్రామాలకు, డోన్‌ మున్సిపాలిటీ, పత్తికొండ ప్రాంతాలకు తాగునీరు అందిస్తోందని సీఎం తెలిపారు. నీటి కొరత సమయంలో కర్నూలు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఇన్ని రకాలుగా ఉపయోగపడే గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు మన ప్రభుత్వం వచ్చాక పెంచిందని పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రధాన కాల్వ నుంచి తూము నిర్మించి గ్రావిటీ ద్వారా ఈ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించే పనులు పూర్తి చేశామని అన్నారు.

 

 

 

చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి హంద్రీనీవాకు ఖర్చు చేసింది కేవలం రూ.13 కోట్లు అయితే.. మహానేత వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక రూ.6 వేల కోట్లతో కాల్వను నిర్మించారని గుర్తు చేశారు. ఈ రోజు ఆ ప్రధాన కాల్వపై తుములు పెట్టి లిప్టుల ద్వారా నీరు చెరువులకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నామని, పడితే ఒకేసారి కుంభవర్షం కురుస్తుందని ఆ సమయంలో నీరు స్టోర్‌ చేసుకోలేకపోతే.. వరదలు వచ్చే రోజులు కూడా తక్కువేనని, ఈ మార్పులను పరిగణలోకి తీసుకొని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్తు అడుగులు పడుతున్నాయని తెలిపారు.

 

 

 

 

అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించాం.. వెలిగొండ ప్రాజెక్ట్ ను వడివడిగా పూర్తి చేస్తున్నాంకరువుతో ఉన్న ప్రకాశం జిల్లాను పట్టించుకునే నాథుడు లేడుని మన కళ్లెదుటే వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం తెలిపారు.గతంలో దివంగత నేత హయాంలో ఒక్కటో టన్నల్‌ 12 కిలోమీటర్లు పూర్తి అయ్యాయని, 2వ టన్నల్‌లో 8 కిలోమీటర్లు పూర్తి చేశారని చెప్పారు, చంద్రబాబు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక వేగంగా పనులు జరుగుతున్నాయని, అక్టోబర్‌ నెలలో 1వ టన్నల్‌ పనులు పూర్తి చేసి ప్రారంభించి జాతికి అంకితం చేస్తానని సీఎం వెల్లడించారు.

 

 

 

మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ జరిగిన మంచిని గమనించండిమీ బిడ్డ అధికారంలోకి రాకముందు.. చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయండి, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మంసాగర్, గండికోట ప్రాజెక్టులకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఆవేదన వ్యక్తం చేశారు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ప్రాజెక్టు కెపాసిటి పెంచామని, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి పూర్తి స్థాయిలో నీటిని నింపుతున్నాని, గతానికి ఇప్పటికి మధ్య ఉన్న తేడాను గమనించాలని ప్రజలను కోరారు.

 

 

 

“ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లు అయ్యాయి. ఐఎఫ్‌బీ ప్యానల్స్‌ వచ్చాయి. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నారు. నాడు–నేడుతో మార్పులు జరుగుతున్నాయి. మనం ఎప్పుడు చూడని విధంగా విలేజ్‌ క్లినిక్స్‌లు, మారిపోయిన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆసుపత్రులు కనిపిస్తున్నాయి. 17 కొత్త మెడికల్‌ కాలేజీలు కనిపిస్తున్నాయి. 53 వేల మంది డాక్టర్లు, సిబ్బందిని నియమించాం. ఆరోగ్య సురక్ష పేరుతో ప్రతి ఇంటికి వస్తున్నారు. ఉచితంగా టెస్టులు చేయించి మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఆర్‌బీకేలు మిమ్మల్ని చేయిపట్టుకుని నడిపిస్తున్నారు. ఈ–క్రాప్‌ నమోదు జరుగుతుంది. పంటల కొనుగోలు జరుగుతుంది. ప్రతి అడుగులోనూ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాం”- సీఎం జగన్

 

 

 

సామాజిక న్యాయంలో మన ప్రభుత్వానికి ఎవరు సాటిలేరని, అబద్ధాలు నమ్మవద్దని, మోసాలు, అబద్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువవుతాయని సీఎం పేర్కొన్నారు. మనకు ఎల్లో మీడియా, దత్తపుత్రుడులేని. తాను నమ్ముకున్నది.. మంచి చేయడం, ఆ మంచి మీ ఇంట్లో జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడాలని సీఎం పిలుపునిచ్చారు. గతానికి, ఇప్పటికీ తేడా గమనించాలని కోరారు. దేవుడి దయ వల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, దేవుడి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సీఎం జగన్‌ సెలవు తీసుకున్నారు.

 

Tags:CM Jagan inaugurated the Lakkasagaram pump house built at a cost of Rs.224 crores

Post Midle