Natyam ad

బాపూజి ఆశయాలను అమలు చేస్తున్న సీఎం జగన్‌

పుంగనూరు ముచ్చట్లు:

జాతిపిత మహాత్మగాంధి ఆశయాలను అమలు చేస్తూ గ్రామస్వరాజ్య పాలనకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తెలిపారు. ఆదివారం మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా తో కలసి గాంధి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కారమై, ప్రజల ముంగిట పాలన అందుతోందని కొనియాడారు.అలాగే విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణారెడ్డి, చెంగారెడ్డి , భరత్‌భూషణ్‌ ఆధ్వర్యంలో గాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు కిజర్‌ఖాన్‌, గంగులమ్మ, త్యాగరాజు, రేష్మా, సాజిదా, భారతి, వైఎస్సార్‌సీపీ నాయకులు పిఎల్‌.శ్రీధర్‌, లక్ష్మణ్‌రాజు, రాజేష్‌, నరేష్‌, మహబూబ్‌బాషా, ఖాదర్‌బాషా, రమణ, అస్లాంమురాధి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: CM Jagan is implementing Bapuji’s ambitions

Post Midle

Leave A Reply

Your email address will not be published.