Natyam ad

గడప వద్దకే పాలన అందిస్తున్న సీఎం జగన్…

-గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం గ్రామ సచివాలయలు…

-శాశ్విత కార్యాలయ భవన నిర్మాణాలతో మారుతున్న పల్లెల రూపురేఖలు…

 

లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:

Post Midle

లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా, డా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలును ప్రారంభించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

లక్కిరెడ్డిపల్లె …

గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా జగనన్న ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు నిలుస్తున్నాయని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లాఅధ్యక్షుడు,ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లెలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా, డా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలును ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, జెడ్పిటిసి రమాదేవి ,మాజీ ఎంపీపీ రెడ్డయ్యలతో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలోనే ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రజా అవసరాల నిమిత్తం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా వ్యయ, ప్రయాసలు లేకుండా చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందచేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాలకు కోట్లాది రూపాయలుతో శాశ్విత కార్యాలయ భవనాలను నిర్మించి పల్లెల మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు.

 

రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు…

వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర నూతన భవన ప్రారంబోత్సవం లో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలుగా ఉపయోగ పడుచున్నాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దప్పేపల్లె గ్రామ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర నూతన భవన ప్రారంబోత్సవంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ రైతు సంక్షేమానికి కృషి చేసి రైతు పక్షపాతిగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు.వారి తనయుడు సీఎం జగన్ అదే బాటలో నడుస్తూ రైతుల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. ప్రతి పంటనూ రైతులు ఈ క్రాపింగ్ చేయించుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులు పండించిన పంటలును ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పించిందన్నారు.

 

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సీఎం జగన్…

 

విలేజ్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
వైద్యరంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.దప్పేపల్లె లోవైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2500 జనాభాకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లును ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లును నియమించారన్నారు. ఈ క్లినిక్ లో12 రకాల వైద్యసేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంటుందన్నారు.ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటివద్దకే నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు.

ఘన స్వాగతం…

నూతన భవనాల ప్రారంభాలకు విచ్చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి స్థానిక ప్రజా ప్రతినిదులు, వైఎస్ఆర్ సిపి నాయకులు ఘన స్వాగతాలు పలికారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు సిద్ధారెడ్డి, జై చంద్రారెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి,ధర్మారెడ్డి, రంగారెడ్డి, వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షులు అంబాబట్టిన.రమేష్, ఉప సర్పంచ్ నరేష్ ,రాజారెడ్డి, పవన్ కుమార్ రెడ్డి ఓబులేసు, పవన్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, శంకర్ నాయుడు, నాగేంద్ర బాబు, సచివాలయ , రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags: CM Jagan is ruling at the gate…

Post Midle