Natyam ad

రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ సీ యం జగన్

-వై ఎస్ ఆర్ టి యు సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజా రెడ్డి ఉద్గాటన

 

తిరుపతి ముచ్చట్లు:


ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని బ్రాండ్ అంబాసిడర్ గా భావించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోనే అత్యంత సంపన్నులైన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం సువర్ణ అధ్యాయమని వై ఎస్ ఆర్ టి యు సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి తెలిపారు. సీ యం గా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో జరిగినా అభివృద్ధిని చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని తెలిపారు. రూ.13లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి పక్షాలు రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందని మరో శ్రీలంక, బీహర్ లాగా అయిపోతుందని విమర్శలు చేసిన వారికి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒక చెంపు పెట్టులాంటిదని తెలిపారు. టి డీ పీ అదినేత చంద్రబాబు నాయుడు నుంచి ఏ ఒక్కరు నోరు కూడా నోరు మేదపలేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

 

 

 

Post Midle

గతంలో చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొని వచ్చి న పెట్టుబడులు కేవలం కాగితాలకే పరిమితమైనాయని విమర్శించారు. సీ యం జగన్ మోహన్ రెడ్డి పారిశ్రామిక వేత్తలను తీసుకొని వచ్చి పరిపాలన విధానం, రాష్ట్రాన్ని మరింత ముందుకు ఎలా తీసుకొని వెళ్ళ వచ్చో చేసి చూపించారని తెలిపారు. ప్రపంచ దిగ్గజ వ్యా పారులైన ముఖేశ్ అంబానీ, కరున్ అదాని, జిందాల్, కియా మోటార్ కంపెనీ ప్రతినిధులు వంటి వారిని ఏ పీ కి తీసుకొని వచ్చిన ఘనత సి ఎం జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకొని వచ్చేందుకు విదేశాలకు వెళ్లి వేల కోట్ల రూపాయల జల్సాలకు ఖర్చు పెట్టారే గానీ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు లను తీసుకొని రాలేక పోయారని విమర్శించారు.

 

Tags; CM Jagan is the brand ambassador of the state

Post Midle