Natyam ad

భవిష్యత్తుకు మార్గదర్శకుడు సీఎం జగన్‌

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శకుడుగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని, ఆయన పాలన చరిత్ర సృష్టించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌లు తెలిపారు. సోమవారం పట్టణంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి కొత్తపేట, ఎంబిటి రోడ్డు, గోకుల్‌వీధి, రహమత్‌నగర్‌లో పర్యటించారు. ముత్తంశెట్టి విశ్వనాథం కట్టక్రిందపాళ్యెం, చింతలవీధి, ఎన్‌ఎస్‌.పేట, కుమ్మరవీధి ప్రాంతాలలో విడివిడిగా ప్రచారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండుకళులా , పేదరికమే ప్రామానికంగా అర్హులైన పేదలందరికి నవరత్న పథకాలు అందించడం జరిగిందని కొనియాడారు.

 

 

Post Midle

రానున్న ఎన్నికల్లో మాయమాటలతో , గారడి మ్యానిఫెస్టోలతో ప్రజలను మోసగించేందుకు వచ్చే ఉమ్మడి పార్టీలు బిజెపి, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకు తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగనన్నను రెండవ సారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరు జగనన్న ప్రచార కర్తలుగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, కౌన్సిలర్లు ఆదిలక్ష్మీ, జయభారతి, రేష్మా, రెడ్డెమ్మ, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

Tags: CM Jagan is the pioneer of the future

Post Midle